తిరువనంతపురం: ఇంధన ధరలను పన్ను ఉగ్రవాదం (Tax Terrorism) అంటూ కేరళ కాంగ్రెస్ అధినేత, ఎమ్మెల్యే షఫి పరంబిల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రభుత్వం తాజాగా పెట్రోల్, డీజిల్‌లపై ధరలు తగ్గించినప్పటికీ ఆ తగ్గింపు సరిపోదని ఆయన అన్నారు. అయితే ప్రస్తుత తగ్గింపు కొంత ఉపశమనమని అన్నారు. ఇంధన ధరల్ని మరింత తగ్గించాలని డిమాండ్ చేసిన షఫీ.. ఈ విషయంలో పినరయి ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గంగా ఉందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల మీద పన్నులు వసూలు చేస్తూ పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. సోమవారం కేరళ రాజధాని తిరువనంతపురంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. పెట్రోల్ పంపుల్లో నిరసన పోస్టర్లు అతికిస్తూ, ప్రజలకు కరపత్రాలు పంచుతూ మోదీ, పినరయి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇవి కూడా చదవండి