పన్నుల పెంపు దుర్మార్గం : మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌

ABN , First Publish Date - 2021-07-27T06:24:17+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి, చెత్త, నీటి పన్ను పెంచడం దుర్మార్గమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేంద్రగౌడ్‌ పేర్కొన్నా రు.

పన్నుల పెంపు దుర్మార్గం : మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌
మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న టీడీపీ, సీపీఐ నాయకులు

గుంతకల్లు టౌన, జూలై 26: రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి, చెత్త, నీటి పన్ను పెంచడం దుర్మార్గమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేంద్రగౌడ్‌ పేర్కొన్నా రు. టీడీపీ, సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం పన్నుల పెంపుపై స్థానిక ము న్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ని నాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనాతో ప్రజలు కష్టాలతో కొట్టుమిట్లాడుతున్నారన్నారు. పనులు లేక వ్యాపారాలులే క ఆర్థిక  పరిస్థితి బాగా లేదన్నారు. ఈ పరిస్థితుల్లో ఇంటి రిజిస్ర్టేషనతో పోల్చి ఆస్తి పన్ను పెంచడం సమంజసం కాదన్నారు. దొడ్డిదారిన పన్నులు పెంచడం పద్ధతి కాదన్నారు. పెంచిన పన్ను జీఓలను వెంటనే రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ తీరుపై ప్రశ్నిస్తే వెంటనే వారిపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన శ్రీనాథ్‌ గౌడ్‌ మాట్లాడుతూ కౌన్సిల్‌ లేని సందర్భంలో పన్నులు పెంచడం తగదన్నారు. సీపీఐ కార్యదర్శి వీరభ ద్ర స్వామి మాట్లాడుతూ పెంచిన పన్నులను వెంటనే నిలిపివేయాలన్నా రు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ బండి శేషన్నకు వినతిపత్రాన్ని అందజేశారు. 


కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు ఆర్‌ పవనకుమార్‌ గౌడ్‌, కృపాకర్‌, గుడ్‌ఫిట్టింగ్‌ ఆంజినేయులు, షరీఫ్‌, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన గుమ్మనూరు వెంకటేశ, మాజీ ఎంపీపీ రాయల రామయ్య, తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు తలారి సరోజమ్మ, టీడీపీ నాయకులు ముక్కన్నగారి రా మాంజినేయులు, బండారు రామన్నచౌదరి, తలారి మస్తానప్ప, అనిల్‌కుమార్‌ గౌడు, ప్రతాప్‌ నాయుడు, ఆమ్లేట్‌ మస్తాన యాదవ్‌, పాల మల్లికార్జున, హనుమంతు, గిడ్డయ్య, వీ రాముడు, ఫజులు, అంజలి పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T06:24:17+05:30 IST