Jun 30 2021 @ 13:17PM

ఓటీటీలో 'స్టేట్ అఫ్ సీజ్'

బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'స్టేజ్ ఆఫ్ సీజ్: టెంపుల్ ఎటాక్'. ఈ మూవీతో డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మూవీ జీ 5 ఓటీటీలో రిలీజ్ చేనున్నారు. 2002లో గుజరాత్ లోని గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న 'అక్షర్ధామ్' ఆలయంపై జరిగిన దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోగా, 80 మందికి పైగా గాయపడ్డారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి) ఉగ్రవాదులను వేటాడి, అదుపులోకి తెచ్చింది. ఎప్పుడు చూసిన ఈ ఘటన ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటుంది. ఇప్పుడు ఈ ఘటన ఆధారంగానే 'స్టేట్ అఫ్ సీజ్ : టెంపుల్ అటాక్' తెరకెక్కుతుండటం ఆసక్తికరమైన విషయం. ఇందులో అక్షయ్ ఓ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారి పాత్రలో కనిపించబోతున్నారు. కెన్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గౌతమ్ రోడ్, వివేక్ దహియా నటించారు. కాంటిలో పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం 'స్టేజ్ ఆఫ్ సీజ్' సిరీస్‌లో రెండవ భాగంగా రాబోతోంది. ఇక అక్షయ్ ఖన్నా 'లెగసీ' అనే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నాడు. రవీనా టాండన్‌ హీరోయిన్‌. 

Bollywoodమరిన్ని...