టాటా విరాన్ నకిలీ చైన్ లింక్ ఫెన్స్ స్వాధీనం

ABN , First Publish Date - 2022-01-19T20:07:37+05:30 IST

తమ ప్రోడక్టుల పేరుతో నకిలీవి విక్రయిస్తున్న కంపెనీలపై టాటా స్టీల్ అధికారులు దాడులు నిర్వహించారు.

టాటా విరాన్ నకిలీ చైన్ లింక్ ఫెన్స్ స్వాధీనం

రాజమహేంద్రవరం: తమ ప్రోడక్టుల పేరుతో నకిలీవి విక్రయిస్తున్న కంపెనీలపై టాటా స్టీల్ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లా పోలీసుల సాయంతో ఎస్ఆర్ ఇండస్ట్రీస్, వెంకటాద్రి వైర్ నెట్టింగ్ ఇండస్ట్రీస్‌పై దాడులు నిర్వహించి ప్రామాణీకరణ ప్యాకేజీలో లేకుండా విక్రయిస్తున్న నకిలీ టాటా విరాన్ చెయిన్ లింక్ ఫెన్స్‌ను టాటా స్టీల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టాటా విరాన్ చైన్ లింక్ ఫెన్స్‌లు, బార్బ్‌డ్ వైర్లు వినూత్నమైన ప్యాకేజీ కలిగి ఉంటాయని, గుర్తింపు పొందిన డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద మాత్రమే దొరుగుతాయని సంస్థ అధికారులు తెలిపారు. ముందస్తు సమాచారంతో చేసిన ఈ దాడుల్లో రూ. 1.26 లక్షల విలువైన నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నకిలీ ప్రొడక్టన్‌ను అమ్ముతున్న రెండు సంస్థలపై సెక్షన్ 420, 483, 486 కింద, అదే విధంగా ట్రేడ్‌మార్క్ చట్టం సెక్షన్స్ 103,104 ప్రకారం కేసులు నమోదు చేశారు.

Updated Date - 2022-01-19T20:07:37+05:30 IST