న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త కార్లను విడుదల చేసినట్లు టాటా మోటార్స్ పేర్కొంది. భారత మార్కెట్లో టాటా టియాగో ఎక్స్‌టిఎ వేరియంట్ కొత్త కార్లను ప్రవేశపెట్టినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది.
ఢిల్లీ ఎక్స్‌షోరూంలో టాటా టియాగో ఎక్స్‌టిఎ వేరియంట్ కొత్త కారు ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు ఉంటుందని కంపెనీ పేర్కొంది. బీఎస్ 6 ప్రమాణాలతో టాటా టియాగో ఎక్స్‌టిఎ కొత్త కారును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది.