దూసుకెళ్లిన Tata Steel.. 5% పెరిగిన షేర్లు

ABN , First Publish Date - 2022-07-28T18:03:42+05:30 IST

ఈ రోజు 1:10 నిష్పత్తిలో షేర్ల ఉపవిభజన కోసం స్టాక్ ఎక్స్-డేట్ ప్రకటించిన తర్వాత గురువారం ఇంట్రా-డేలో టాటా స్టీల్(Tata Steel) షేర్లు

దూసుకెళ్లిన Tata Steel.. 5% పెరిగిన షేర్లు

Tata Steel : ఈ రోజు 1:10 నిష్పత్తిలో షేర్ల ఉపవిభజన కోసం స్టాక్ ఎక్స్-డేట్ ప్రకటించిన తర్వాత గురువారం ఇంట్రా-డేలో టాటా స్టీల్(Tata Steel) షేర్లు బీఎస్ఈలో 5 శాతం పెరిగి రూ.100.45 వద్ద ఉన్నాయి. 10 రూపాయల ముఖ విలువ కలిగిన ప్రతి ఒక్క ఈక్విటీ షేర్ సబ్-డివిజన్/స్ప్లిట్ ప్రయోజనం కోసం షేర్‌హోల్డర్ల అర్హతను నిర్ణయించే ఉద్దేశ్యంతో కంపెనీ జూలై 29, 2022 శుక్రవారం 'రికార్డ్ డేట్'గా నిర్ణయించింది.


ఉదయం 11:30 గంటలకు  టాటా స్టీల్ 4 శాతం లాభంతో రూ.99.75 వద్ద ట్రేడవుతోంది. ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్‌లో 1.5 శాతం పెరిగింది. ఎన్‌ఎస్‌ఈ(NSE), బీఎస్‌ఈ(BSE)లో కలిపి 72.52 మిలియన్ల ఈక్విటీ షేర్లు చేతులు మారాయి. గత రెండు వారాల్లో.. స్టాక్ స్ప్లిట్‌(Stock Split)కు ముందు కౌంటర్‌లో సగటున 7 మిలియన్ షేర్లు ట్రేడ్ అయ్యాయి. టాటా స్టీల్‌ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మే 03, 2022న కంపెనీ ఈక్విటీ షేర్ల సబ్ డివిజన్ ప్రతిపాదనను ఆమోదించారు. 


క్యాపిటల్ మార్కెట్(Capital Market), షేర్‌హోల్డర్ బేస్‌(Shareholder Base)ను విస్తృతం చేయడానికి, చిన్న పెట్టుబడిదారులకు షేర్లను మరింత సులువుగా చేయడానికి ఈ స్టాక్ స్ల్పిట్ సాయపడుతుంది. ప్రధానంగా స్టాక్ స్ప్లిట్ ప్రయోజనం ఏమిటంటే.. షేర్లు రిటైల్ ఇన్వెస్టర్లకు మరింత అందుబాటులోకి వస్తాయి. ఇది కౌంటర్‌లో లిక్విడిటీని పెంచుతుంది. స్టాక్ స్ప్లిట్ తర్వాత షేర్లను కొనడం, విక్రయించడం చాలా సులభం అవుతుంది.


Updated Date - 2022-07-28T18:03:42+05:30 IST