టీసీఎస్‌ బైబ్యాక్‌లో టాటా సన్స్‌

ABN , First Publish Date - 2022-01-15T08:39:33+05:30 IST

వాటాదారుల నుంచి రూ.18,000 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేయనున్నట్లు త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా టాటా

టీసీఎస్‌ బైబ్యాక్‌లో టాటా సన్స్‌

న్యూఢిల్లీ: వాటాదారుల నుంచి రూ.18,000 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌  చేయనున్నట్లు త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స (టీసీఎస్‌) ప్రకటించింది. ఈ బైబ్యాక్‌ కార్యక్రమంలో భాగంగా కంపెనీ ప్రమోటర్లైన టాటా సన్స్‌, టాటా ఇన్వె్‌స్టమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీఐసీఎల్‌) తమ వాటా నుంచి రూ.12,993.2 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నాయి. అంటే, బైబ్యాక్‌ విలువలో మూడింట రెండొంతులకు పైగా వాటా షేర్లను ప్రమోటర్లే విక్రయించినట్లవుతుంది. టాటా సన్స్‌ వద్ద టీసీఎ్‌సకు చెందిన 266.91 కోట్ల షేర్లుండగా.. అందులో 2.88 కోట్ల షేర్లను విక్రయించాలనుకుంటోంది. ఇక టీఐసీఎల్‌ వద్ద 10,23,685 షేర్లుండగా.. 11,055 షేర్లను కంపెనీకి అప్పగించాలనుకుంటోంది. 


Updated Date - 2022-01-15T08:39:33+05:30 IST