ఎయిర్ ఇండియా చీఫ్‌గా టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్

ABN , First Publish Date - 2022-03-15T02:30:42+05:30 IST

ఎయిర్ ఇండియాకు కొత్త చీఫ్ వచ్చేశారు. టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌ను ఎయిర్ ఇండియా కొత్త చీఫ్‌గా..

ఎయిర్ ఇండియా చీఫ్‌గా టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు కొత్త చీఫ్ వచ్చేశారు. టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌ను ఎయిర్ ఇండియా కొత్త చీఫ్‌గా నియమించినట్టు టాటా గ్రూప్ ప్రకటించింది. టర్కీకి చెందిన ఇల్కర్ ఐసి టాటా ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉండేదుకు నిరాకరించిన నేపథ్యంలో టాటా గ్రూప్ ఈ ప్రకటన చేసింది.


ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియాను సొంతం చేసుకున్న టాటా గ్రూప్.. టర్కిష్ ఎయిర్‌లైన్స్ మాజీ సీఈవో ఇల్కర్ ఐసిని సీఈవోగా నియమించింది. అయితే, ఈ ప్రకటనపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో సీఈవోగా వచ్చేందుకు ఇల్కర్ నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే టాటా గ్రూప్ తాజా ప్రకటన చేసింది.


ఎన్.చంద్రశేఖరన్ ప్రస్తుతం టాటా సన్స్ చైర్మన్‌గా ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియాను సొంతం చేసుకోవడంలో చంద్రశేఖరన్ కీలక పాత్ర పోషించారు. చంద్రశేఖరన్ ఇటీవల ఎయిర్ ఇండియా సిబ్బందికి ఓ సందేశం ఇచ్చారు. ఎయిర్ ఇండియాను ప్రపంచస్థాయికి చేర్చేందుకు టాటా గ్రూప్ కట్టుబడి ఉందని అందులో పేర్కొన్నారు. కస్టమర్ సర్వీస్‌లో ఎయిర్ ఇండియాను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు గ్రూప్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. 69 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది జనవరి 27న ఎయిర్ ఇండియా తిరిగి టాటా గ్రూప్ సొంతమైంది.   

Updated Date - 2022-03-15T02:30:42+05:30 IST