విక్రయాలు నామమాత్రంగానే ఉన్నప్పటికీ...

ABN , First Publish Date - 2022-02-01T20:08:33+05:30 IST

విక్రయాలు నామమాత్రంగానే ఉన్నప్పటికీ... టాటా మోటార్స్ పరుగెడుతోంది. కేవలం... అనుబంధ సంస్థ ‘జాగ్వార్ లాండ్ రోవర్’ వ్యాపారమే ఇందుకు కారణం.

విక్రయాలు నామమాత్రంగానే ఉన్నప్పటికీ...

రేంజ్ రోవర్, డిఫెండర్ కార్లు వాటా 43 శాతం... 

ఇక... చిప్ సరఫరా మెరుగుపడుతున్నందున మరింత వృద్ధిని ఆశిస్తోన్న కంపెనీ... 

మధ్యాహ్నం 12 గంటలకు... రూ. 506.85 త 

ముంబై : విక్రయాలు నామమాత్రంగానే ఉన్నప్పటికీ... టాటా మోటార్స్ పరుగెడుతోంది. కేవలం... అనుబంధ సంస్థ ‘జాగ్వార్ లాండ్ రోవర్’ వ్యాపారమే ఇందుకు కారణం.  చిప్‌ కొరత కారణంగా డిసెంబరు త్రైమాికంలో అమ్మకాలు తగ్గినా, కాస్త మంచి నంబర్లనే పోస్ట్‌ చేయడం గమనార్హం. మూడో త్రైమాసికంలో విక్రయాలు స్వల్పంగానే ఉన్నా, ఆపరేటింగ్ మార్జిన్‌లో వృద్ధి కనిపించింది, బుకింగ్స్‌ పెరిగాయి. మొత్తంగా చూస్తే.. ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా ఎనిమిది శాతం ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌తో, బ్లూమ్‌బెర్గ్ అంచనాలను జేఎల్‌ఆర్  అధిగమించింది. మొత్తంమీద... కంపెనీ ఇన్సెంటివ్స్‌, ఇన్వెంటరీ తగ్గిన నేపధ్యంలో... డిసెంబరు త్రైమాసికంలో జేఎల్‌ఆర్  ఆపరేటింగ్ మార్జిన్... త్రైమాసికం ప్రాతిపదికన 467 బేసిస్ పాయింట్లు పెరిగి, 12 శాతానికి చేరుకుంది. మొత్తం 69,200 యూనిట్ల అమ్మకాలతో, సాధారణ త్రైమాసిక హోల్‌‌సేల్ నంబర్ దాదాపు సగానికి తగ్గినప్పటికీ... ఎబిట్ మార్జిన్‌ మాత్రం పెరిగింది. ఇక... వార్షిక ప్రాతిపదికన చూస్తే, హోల్‌సేల్‌ అమ్మకాల్లో 32 శాతం  డ్రాప్‌ కనిపించింది.


బ్రేక్-ఈవెన్ వ్యయాలను ఈ కంపెనీ క్రమంగా తగ్గిస్తోన్న విషయం తెలిైసిందే. వార్షిక బ్రేక్‌ఈవెన్ వాల్యూమ్స్‌... 2022 ఆర్ధిక సంవత్సరం  మొదటి అర్ధ భాగంలోని 3.60 లక్షల యూనిట్ల నుంచి, రెండో అర్ధభాగంలో మూడు లక్షల యూనిట్లకు పడిపోయాయి. అంతేగాకుండా... అధిక మార్జిన్‌ ఇచ్చే రేంజ్ రోవర్ షేర్‌ మొత్తం హోల్‌సేల్‌ వాల్యూమ్స్‌లో 55 శాతానికి పెరిగింది. కిందటి త్రైమాసికంలో ఇది 46 శాతంగా ఉంది. ఖర్చుల్లో పొదుపు కార్యక్రమం('రీఫోకస్‌) నేపధ్యంలో... సుమారు 400 మిలియన్ పౌండ్లు మిగులుబాటు చోటుచేసుకున్నట్లు కంపెనీ చెబుతోంది. ఏడాది ప్రాతిపదికన చూస్తే ఇది సుమారు బిలియన్ పౌండ్లకు  చేరుకుంది. రీఫోకస్‌ నుంచి మరో 400 మిలియన్ పౌండ్ల మేర   పొదుపులను చూసే అవకాశమున్నట్లు కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా... జేఎల్‌ఆర్ కార్లకు డిమాండ్ తారస్థాయిలో ఉన్న విషయం తెలిైసిందే. గత త్రైమాసికంలోని ఆర్డర్‌ బుక్‌ 1.25 లక్షలతో  పోలిస్తే... ఈ త్రైమాసికంలో 1.55 లక్షల యూనిట్ల రికార్డ్ స్థాయికి చేరుకుంది. కొత్త రేంజ్ రోవర్, డిఫెండర్ కార్లు మొత్తం ఆర్డర్ బుక్‌లో 43 శాతంగా ఉండడం విశేషం. ఇక... చిప్ సరఫరా మెరుగుపడుతున్నందున, మార్చి త్రైమాసికం వాల్యూమ్స్‌లో మరింత వృద్ధిని టాటా మోటార్స్ ఆశిస్తోంది. 


దేశంలో తన మార్కెట్ పొజిషన్‌ని టాటా మోటార్స్‌ బలోపేతం చేసుకుంటోంది, ఆదాయం కూడా పెరుగుతూ వచ్చింది. కానీ, పెరిగిన ముడి వస్తువుల ధరలు, వన్-టైమ్ సబ్సిడీ వ్యయాల కారణంగా లాభాలపై ఒత్తిడి కొనసాగుతున్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. మూడో త్రైమాసికంలో ప్యాసింజర్ వెహికల్‌ మార్కెట్ వాటాను 13 శాతానికి పెంచడం ద్వారా, అమ్మకాల్లో బహుళ-సంవత్సరాల గరిష్టాలను తాకింది. ఏడాది క్రితంతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. పాసిం.జక: వెహికిల్స్‌పై ఆదాయం 72 % పెరిగి, రూ. 8,600 కోట్లకు చేరుకుంది, ఎబిటా మార్జిన్ 6.2 శాతంగా తేలింది. ముడిసరుకు ధరలు తగ్గడం, ప్రొడక్ట్‌ రేట్ల పెరుగుదలతో మార్చి త్రైమాసికం నుంచి పాసింజర్ వెహికిల్ సెగ్మెంట్‌ ఎబిట్‌ సానుకూలంగా మారవచ్చునని చెబుతున్నారు.


వాణిజ్య వాహనాల ఆదాయం వార్సిక ప్రాతిపదికన 28 % పెరిగి, రూ. 12,300 కోట్లకు చేరుకుంది. అయితే... సీవీ ఎబిటా మార్జిన్ త్రైమాసికంలో 50 బీపీఎస్ తగ్గింది. ముడి వస్తువుల వ్యయాలు ప్రభావం చూపాయి. జేఎల్‌ఆర్ వాల్యూమ్స్‌ మెరుగుపడడంతో  'సమ్-ఆఫ్-ది-పార్ట్స్' విలువలు పెరిగే అవకాశమున్నట్లు భావిస్తున్నారుజేఎల్‌ఆర్ వాల్యూమ్స్‌లో మెరుగుదల, భారత వ్యాపారంలో మెరుగుపడుతున్న మార్జిన్లను దృష్ట్యా... టాటా మోటార్స్‌ స్టాక్‌ను రాడార్‌లో పెట్టుకోవచ్చన్న వ్యాఖ్యానాలు ఈ సందర్భంగా వినవైస్తున్నాయి. ఈ రోజు(మంగళవారం) మధ్యాహ్నం 12.10 గంటల సమయానికి దాదాపు రెండు శాతానికి  పైగా పడిపోయినన టాటా మోటార్స్‌ షేర్లు రూ. 506.85 వద్ద ఉన్నాయి.


Updated Date - 2022-02-01T20:08:33+05:30 IST