సబ్‌స్ర్కిప్షన్‌ మోడల్‌లో నెక్సాన్‌ ఈవీ

ABN , First Publish Date - 2020-08-07T06:44:22+05:30 IST

టాటా మోటార్స్‌.. ఎలక్ర్టిక్‌ వెర్షన్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ నెక్సాన్‌ కోసం సబ్‌స్ర్కిప్షన్‌ మోడల్‌ను తీసుకువచ్చింది. ఈ విధానంలో ఫిక్స్‌డ్‌ మంత్లీ రెంటల్‌తో వినియోగదారులకు నెక్సాన్‌ అందుబాటులో ఉంటుంది...

సబ్‌స్ర్కిప్షన్‌ మోడల్‌లో నెక్సాన్‌ ఈవీ

  • ప్రారంభించిన టాటా మోటార్స్‌ 


టాటా మోటార్స్‌.. ఎలక్ర్టిక్‌ వెర్షన్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ నెక్సాన్‌ కోసం సబ్‌స్ర్కిప్షన్‌ మోడల్‌ను తీసుకువచ్చింది. ఈ విధానంలో ఫిక్స్‌డ్‌ మంత్లీ రెంటల్‌తో వినియోగదారులకు నెక్సాన్‌ అందుబాటులో ఉంటుంది. ఈ మంత్లీ రెంటల్‌ రూ.41,900 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది. వినియోగదారులకు 18, 24, 36 నెలల కాలానికి ఈ సబ్‌స్ర్కిప్షన్‌ అందుబాటులో ఉండనుంది. 18 నెలల కాలానికి సంబంధించి ప్రతి నెలకు రూ.47,900, 24 నెలలకు రూ.44,900, 36 నెలలకు రూ.41,900లను సబ్‌స్ర్కిప్షన్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ సబ్‌స్ర్కిప్షన్‌ సేవల కోసం టాటా మోటార్స్‌.. ఇప్పటికే ఓరిక్స్‌ ఆటో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్వీసె్‌సతో జట్టు కట్టింది. తొలుత హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్‌, ముంబై, పుణె నగరాల్లో వినియోగదారులకు ఈ మోడల్‌ అందుబాటులో ఉంటుంది. 

Updated Date - 2020-08-07T06:44:22+05:30 IST