అమ్మకాల్లో దూసుకెళ్తోన్న Tata Motors వాహనాలు

ABN , First Publish Date - 2021-09-02T01:22:46+05:30 IST

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ అమ్మకాల్లో దూసుకెళ్తోంది. ఆగస్టు నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 51 శాతం పెరిగినట్లు టాటా మోటార్స్ పేర్కొంది.

అమ్మకాల్లో దూసుకెళ్తోన్న Tata Motors వాహనాలు

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ అమ్మకాల్లో దూసుకెళ్తోంది. ఆగస్టు నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 51 శాతం పెరిగినట్లు టాటా మోటార్స్ పేర్కొంది. గత నెలలో మొత్తం 28,018 ప్యాసింజర్ వాహనాలను అమ్మినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. గత నెలలో 1022 యూనిట్లఎలక్ట్రిక్ వాహనాలను అమ్మినట్లు సంస్థ తెలిపింది. ఈ సంవత్సరం ఆగస్టు నాటికి 54,190 యూనిట్ల వాహనాలను విక్రయించినట్లు సంస్థ పేర్కొంది. జూలై 2020తో పోలిస్తే టాటా మోటార్స్ దేశీయ అమ్మకాలలో 4 శాతం పెంపును నమోదు చేసిందని సంస్థ తెలిపింది.

Updated Date - 2021-09-02T01:22:46+05:30 IST