టాటా మోటార్స్‌ నష్టం రూ.307 కోట్లు

ABN , First Publish Date - 2020-10-28T08:13:02+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జూలై-సెప్టెంబరు)లో టాటా మో టార్స్‌ రూ.307.26 కోట్ల కన్సాలిడేటెడ్‌ నష్టాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి కంపెనీ నష్టం రూ.187.7 కోట్లుగా నమోదైంది...

టాటా మోటార్స్‌ నష్టం రూ.307 కోట్లు

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జూలై-సెప్టెంబరు)లో టాటా మో టార్స్‌ రూ.307.26 కోట్ల కన్సాలిడేటెడ్‌ నష్టాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి కంపెనీ నష్టం రూ.187.7 కోట్లుగా నమోదైంది. ఈ మూడు నెలల్లో టాటా మోటార్స్‌ ఆదాయం సైతం రూ.53,530 కోట్లకు తగ్గింది. క్రితం ఏడాదిలో ఇదే కాలానికి రూ.65,431.95 కోట్ల రాబడి గడించింది. సమీక్షా కాలానికి కంపెనీ స్టాండలోన్‌ నష్టం రూ.1,212.45 కోట్లు, ఆదాయం రూ.9,668.10 కోట్లుగా నమోయ్యీయి. టాటా మోటార్స్‌కు చెందిన అంతర్జాతీయ కార్ల బ్రాండ్‌ జాగ్వార్‌ లాండ్‌రోవర్‌ పనితీరు మెరుగుపడటంతో కన్సాలిడేటెడ్‌  నష్టాలు తగ్గేందుకు దోహదపడింది. గడిచిన మూడు నెలల్లో జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ ఆదాయం  440 కోట్ల పౌండ్లుగా నమోదైంది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే 52.2 శాతం వృద్ధి కనబర్చింది. ఈ విభాగ లాభం 6.5 కోట్ల పౌండ్లకు పెరిగింది. మలివిడత వైరస్‌ వ్యాప్తి, భౌగోళికరాజకీయ ఆందోళనలు ఉన్నప్పటికీ.. మున్ముందు నెలల్లో వాహనాల గిరాకీ, సరఫరా మరింత మెరుగుపడనుందని టాటామోటార్స్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. 

Updated Date - 2020-10-28T08:13:02+05:30 IST