టాటా మోటార్స్‌ రికార్డు

ABN , First Publish Date - 2020-10-25T09:46:51+05:30 IST

ప్యాసింజర్‌ వాహన విభాగంలో టాటా మోటార్స్‌ సరికొత్త మైలురాయిని చేరుకుంది. ప్యాసింజర్‌ వాహన విభాగంలో తొలి మోడల్‌ను విడుదల చేసిన మూడు దశాబ్దాల తర్వాత వాహన ఉత్పత్తి సామర్థ్యం 40 లక్షల యూనిట్లను అధిగమించిందని కంపెనీ వెల్లడించింది...

టాటా మోటార్స్‌ రికార్డు

  • ప్యాసింజర్‌ వాహన విభాగంలో 
  • 40 లక్షల యూనిట్ల ఉత్పత్తి 


న్యూఢిల్లీ : ప్యాసింజర్‌ వాహన విభాగంలో టాటా మోటార్స్‌ సరికొత్త మైలురాయిని చేరుకుంది. ప్యాసింజర్‌ వాహన విభాగంలో తొలి మోడల్‌ను విడుదల చేసిన మూడు దశాబ్దాల తర్వాత వాహన ఉత్పత్తి సామర్థ్యం 40 లక్షల యూనిట్లను అధిగమించిందని కంపెనీ వెల్లడించింది.


1991లో టాటా సియెర్రా ఎస్‌యూవీని విడుదల చేయటం ద్వారా టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ కార్ల విభాగంలో అడుగుపెట్టింది. ఈ ముప్పై ఏళ్లలో కంపెనీ.. ఇండికా, సియెర్రా, సుమో, సఫారీ, నానో సహా పలు కొత్త వాహనాలను తీసుకువచ్చింది. 2005-05లో 10 లక్షల ఉత్పత్తి మార్కును చేరుకోగా 30 లక్షల మార్కును 2015లో అందుకుంది. టాటా మోటార్స్‌కు ఇది మరిచిపోలేని మైలురాయి అని, ఆటోమొబైల్‌ పరిశ్రమలో కొద్ది మంది మాత్రమే ఈ మార్కును చేరుకున్నారని సంస్థ ప్రెసిడెంట్‌ (ప్యాసింజర్‌ వెహికల్స్‌ బిజినెస్‌) శైలేష్‌ చంద్ర అన్నారు.

Updated Date - 2020-10-25T09:46:51+05:30 IST