చెట్టును ఢీకొన్న టాటా మ్యాజిక్‌

ABN , First Publish Date - 2021-01-24T06:15:29+05:30 IST

వ్యవసాయ కూలీలను తరలిస్తున్న టాటా మ్యాజిక్‌ వాహనం ఎటపాక మండలం నల్లకుంట గ్రామ శివారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి రహదారి పక్కనున్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో 8 మంది వ్యవసాయ కూలీలు గాయపడ్డారు.

చెట్టును ఢీకొన్న టాటా మ్యాజిక్‌
చెట్టును ఢీకొన్న వాహనం

 ఎటపాక, జనవరి 23: వ్యవసాయ కూలీలను తరలిస్తున్న టాటా మ్యాజిక్‌ వాహనం ఎటపాక మండలం నల్లకుంట గ్రామ శివారు  ప్రమాదవశాత్తు అదుపుతప్పి రహదారి పక్కనున్న చెట్టును ఢీకొంది. ఈ  ప్రమాదంలో 8 మంది వ్యవసాయ కూలీలు గాయపడ్డారు. చింతూరు మండలం బొడ్డుగూడెం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు ఇటీవల ఎటపాక మండలంలోని పలు ప్రాంతాలకు మిర్చి కోతల పనులకు వెళుతున్నారు. రోజు మాదిరిగానే శనివారం టాటామ్యాజిక్‌ వాహనంలో పనులకు వెళుతుండగా  నల్లకుంట గ్రామ శివారు ప్రాంతంలో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో రవ్వా విజయ్‌కుమారి, కె.తిరుపతమ్మ, కె.రమ్య, కిరణ్‌కుమార్‌, మహేశ్వరరావు, చందురెడ్డి, జోగారావు, కన్నమ్మకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను గౌరీదేవిపేట పీహెచ్‌సీకు తరలించారు. వారిలో తీవ్ర గాయాలైన రవ్వా విజయ్‌కుమారి, తిరుపతమ్మ, రమ్య, కిరణ్‌కుమార్‌, చందురెడ్డిని మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.  ఈ ప్రమాద సమయంలో టాటా మ్యాజిక్‌లో సుమారు 18 మంది కూలీలు ఉన్నట్టు తెలిసింది. 

Updated Date - 2021-01-24T06:15:29+05:30 IST