టాటా గ్రూప్‌-వాల్‌మార్ట్‌ దోస్తీ

ABN , First Publish Date - 2020-09-30T06:56:15+05:30 IST

టాటా సన్స్‌ అభివృద్ధి చేస్తున్న సూపర్‌ యాప్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ రిటైలింగ్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ సన్నాహాలు చేస్తోంది. వాల్‌మార్ట్‌ అనుబంధ రిటైల్‌ విభాగం ఫ్లిప్‌కార్ట్‌ డిజిటల్‌ సేవలను మరింత విస్తరించేందుకు ఈ పెట్టుబడులు దోహదపడనున్నాయి...

టాటా గ్రూప్‌-వాల్‌మార్ట్‌ దోస్తీ

  • ‘సూపర్‌ యాప్‌’లో భారీ వాటాపై చర్చలు

ముంబై : టాటా సన్స్‌ అభివృద్ధి చేస్తున్న సూపర్‌ యాప్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ రిటైలింగ్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ సన్నాహాలు చేస్తోంది. వాల్‌మార్ట్‌ అనుబంధ రిటైల్‌ విభాగం ఫ్లిప్‌కార్ట్‌ డిజిటల్‌ సేవలను మరింత విస్తరించేందుకు ఈ పెట్టుబడులు దోహదపడనున్నాయి. టాటా సన్స్‌ అనుబంధ సంస్థ ఈ సూపర్‌ యాప్‌ను హోస్ట్‌ చేసే ఆస్కారం ఉంది.


వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా 2000-2500 కోట్ల డాలర్ల (రూ.1.5 లక్షల కోట్ల నుంచి 1.87 లక్షల కోట్లు) భారీ పెట్టుబడులను పెట్టేందుకు వాల్‌మార్ట్‌ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్‌ సఫలమైతే దేశంలోని రిటైల్‌ విభాగంలో ఇదే అతి పెద్ద డీల్‌ అవుతుంది. ఈ సూపర్‌ యాప్‌ విలువ 5000-6000 కోట్ల డాలర్లు (రూ. 3.75 లక్షల కోట్ల నుంచి రూ.4.5 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే డిసెంబరు లేదా జనవరిలో ఈ యాప్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది. 

Updated Date - 2020-09-30T06:56:15+05:30 IST