మరి.. మగాళ్లు సగం దుస్తులు ధరిస్తే?

ABN , First Publish Date - 2021-06-23T09:55:07+05:30 IST

మహిళల వస్త్రాధారణ విషయంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరి.. మగాళ్లు  సగం దుస్తులు ధరిస్తే?

ఇమ్రాన్‌ వ్యాఖ్యలపై తస్లీమా ఫైర్‌

న్యూఢిల్లీ, జూన్‌ 22: మహిళల వస్త్రాధారణ విషయంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇమ్రాన్‌పై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ మండిపడ్డారు. ‘‘ఓ మగాడు పాక్షికంగా దుస్తులు ధరిస్తే.. మహిళలు రోబోలుకాని పక్షంలో.. ఆ దుస్తుల ప్రభావం మహిళలపై ఉంటుంది’’ అని ట్వీట్‌ చేశారు. గతంలో ఇమ్రాన్‌ అర్ధనగ్నంగా ఉన్న ఫొటోను దానికి జత చేశారు. ఇటీవల ఇమ్రాన్‌ ఓ ఇంటర్వ్యూలో.. ‘‘మహిళలు పాక్షికంగా దుస్తులు ధరిస్తే..  రోబోలు కానిపక్షంలో ఆ ప్రభావం పురుషులపై ఉంటుంది. ఇది సామాన్యంగా బోధపడే విషయమే. అసభ్యతే అత్యాచారాలకు కారణం’’ అని అనడంతో దుమారం రేగింది.



Updated Date - 2021-06-23T09:55:07+05:30 IST