పనులను సకాలంలో పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-06-30T06:44:25+05:30 IST

నల్లగొండ పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించా రు. బుధవారం కలెక్టర్‌లో మునిసిపల్‌ కమిషనర్‌, ఇంజనీర్లు, ఏజెన్సీ నిర్వాహకులతో కలిసి పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.

పనులను సకాలంలో పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌శర్మ

జిల్లా కలెక్టర్‌ రాహుల్‌శర్మ 


నల్లగొండ టౌన్‌, జూన్‌ 29: నల్లగొండ పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించా రు. బుధవారం కలెక్టర్‌లో మునిసిపల్‌ కమిషనర్‌, ఇంజనీర్లు, ఏజెన్సీ నిర్వాహకులతో కలిసి పట్టణంలో  కొనసాగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పనులను మూడు భాగాలుగా విభజించి మర్రిగూడ బైపా్‌సనుంచి రైల్వే బ్రిడ్జి వరకు ఒక టీం, రైల్వే బ్రిడ్జి నుంచి వివేకానంద విగ్రహం వరకు రెండో టీం, వివేకానంద విగ్రహం నుం చి ఎన్జీ కళాశాల వరకు మూడు టీంలుగా విభజన చేసి కాంట్రాక్టర్‌తో కలిసి పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్ల విస్తరణ, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ పను లు పూర్తి చేసిన ప్రాంతంలో వెంటనే ఫుట్‌పాత్‌ పనులు ప్రారంభించాలన్నారు. రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో మునిసిపల్‌ కమిషనర్‌ కేవీ రమణాచారి పాల్గొన్నారు. 


క్రీడా ప్రాంగణాలకు, ప్రకృతి వనాలకు స్థలాలను గుర్తించాలి 

గ్రామీణ క్రీడా ప్రాంగణాలకు, బృహత్‌ ప్రకృతి వనాలకు స్థలాలను గుర్తించాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ తహసీల్దార్లు, ఎంపీడీవోలను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామ పంచాయతీల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్‌ వి. చంద్రశేఖర్‌, జడ్పీ సీఈవో ఎన్‌. ప్రేమ్‌కరణ్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-30T06:44:25+05:30 IST