కొవిడ్‌ నిబంధనలు కఠినతరం చేయాలి

ABN , First Publish Date - 2021-04-19T06:15:43+05:30 IST

కొవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆర్డీవో ఖాజావలి సూచించారు. ఆదివారం డివిజన్‌ స్ధాయి టాస్క్‌ఫోర్స్‌ సమావేశం ఆర్డీవో కార్యాలయంలో జరిగింది.

కొవిడ్‌ నిబంధనలు కఠినతరం చేయాలి
డివిజన్‌ స్ధాయి టాస్క్‌ఫోర్సు సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో ఖాజావలి

మాస్కు లేకుంటే రూ.1000 జరిమానా

థియేటర్లలో 50శాతం మించి టికెట్లు విక్రయించరాదు

బందరు ప్రభుత్వాసుపత్రిలో హెల్ప్‌డెస్క్

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 18 :  కొవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆర్డీవో ఖాజావలి సూచించారు. ఆదివారం డివిజన్‌ స్ధాయి టాస్క్‌ఫోర్స్‌ సమావేశం ఆర్డీవో కార్యాలయంలో జరిగింది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా  ఈ టాస్క్‌ పోర్సు సమా వేశంలో డివిజన్‌లోని తాజా పరిస్ధితిపై డీఎస్పీ రమేష్‌ రెడ్డి, తహసీల్దారు సునిల్‌ బాబు, ఇతర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆర్డీవో సమీక్ష జరిపారు. అనంతరం ఆర్డీవో ఖాజవలి విలేకరులతో మాట్లాడారు.    రైతు బజార్లలో అత్యధిక సంఖ్యలో ప్రజలు గుమికూడ కుండా చర్యలు చేపట్టాలన్నారు. చిన్న దుకాణం వద్ద మాస్కు లేకుండా కనపడితే రూ 500, పెద్ద దుకాణం వద్ద మాస్కులేక పోతే రూ.1000 జరిమానా విధిస్తా రన్నారు. ఇందుకు మునిసిపల్‌, రెవెన్యూ, పోలీసు, పంచా యతీ రాజ్‌ శాఖల సిబ్బందితో టీములు వేస్తామన్నారు. తాజా కొవిడ్‌ నిబంధనల ప్రకారం థియేటర్లలో 50 శాతం మించి టిక్కెట్‌లు విక్రయంచరాదని ఆర్డీవో ఖాజావలి ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఆంధ్ర ఆసుపత్రి లో ప్రత్యేక కొవిడ్‌ వార్డులను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశామన్నారు. ఉదయం షిప్టులో శామ్యూ ల్‌పాల్‌ (సెల్‌ 7981551137), మధ్యాహ్నం షిప్టులో స్వాతిశ్రీ (సెల్‌ 91219400277), రాత్రి షిప్టులో వర ప్రసాద్‌ (సెల్‌ 9515678277)కు బాధితులు ఫోను చేసి కరోనా సాయం పొందవచ్చన్నారు. కొవిడ్‌ లక్షణాలు కల వారికి పీహెచ్‌సీ  లలో వీర్‌డీఎల్‌ పరీక్ష ్టు చేయిం చుకో వచ్చన్నారు. డీఎస్పీ రమేష్‌ రెడ్డి మాట్లాడుతూ, మండల స్థాయిలో, మునిసిపల్‌, నగరపాలక సంస్థల స్థాయిల్లో కమిటీలు వేస్తామన్నారు. ఈ సమావేశంలో రైతు బజారు ఎస్టేట్‌ ఆఫీసరు అమీర్‌  పాల్గొన్నారు. 

నగరపాలక సంస్థ కార్యాలయంలో..  

మచిలీపట్నం నగర పాలక సంస్థ కార్యాలయంలో హెల్ప్‌ లైన్‌ డెస్క్‌ ఏర్పాటు చేసినట్టు కమిషనర్‌ ఎస్‌.శివ రామకృష్ణ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ హెల్ప్‌డెస్క్‌ పనిచేస్తుందన్నారు. ప్రజలు కరోనా, టిట్కో ఇళ్లు, ఇతర సమస్యలు ఏవైనా ఉంటే కార్యాలయంలోని హెల్ప్‌ డెస్కులో సంప్రదిం చవచ్చన్నారు.  08672- 227700కు ఫోను చేయవచ్చ న్నారు. కాగా 19, 20 తేదీలలో చిలకలపూడి, సుందరయ్య నగర్‌ తుపాను షెల్టర్‌వద్ద కొవిడ్‌ టీకాలు వేస్తారన్నారు. మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు, టీచర్లు కొవిడ్‌ వాక్సి న్‌ వేయించుకోవాలన్నారు.  

Updated Date - 2021-04-19T06:15:43+05:30 IST