Abn logo
Sep 26 2021 @ 00:30AM

అక్రమ నిర్మాణాలపై టాస్క్‌ఫోర్స్‌ కొరడా

ఇంటి దర్వాజలను తొలగిస్తున్న సిబ్బంది

భువనగిరిటౌన్‌, సెప్టెంబరు 25: అక్రమ కట్టాడాలపై యాదాద్రి భువ నగిరి జిల్లా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు కొరడా ఝలిపించారు. నిబంధనలకు విరుద్ధంగా జిల్లాకేంద్రంలో నిర్మిస్తున్న భవనాన్ని శనివారం పాక్షికంగా కూల్చివేశారు. పట్టణంలోని జిల్లా ఆస్పత్రి వెనుక ఏఎమ్‌ఆర్‌నగర్‌లో భవన నిర్మాణం కోసం హీరేకార్‌ సుమిత్ర ఆరు నెలల క్రితం టీఎస్‌ బిపా్‌సలో చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైంది. అయినప్పటికీ రెండతస్థులు, పెంట్‌హౌస్‌తో భవనాన్ని నిర్మించారు. రెండు నెలల క్రితం అధికారులు నోటీ సులు పంపారు. దానికి స్పందించలేదు. ఈ మేరకు అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ ఆధ్వర్యంలో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు భువనగిరిలో శనివారం చేపట్టిన తనిఖీల్లో ఆ అక్రమ నిర్మాణం వెలుగుచూసింది. దీంతో ఆ భవనా న్ని పాక్షికంగా కూల్చివేశారు. నిబంధనలకు అనుగుణంగా మరోసారి టీఎస్‌ బిపా్‌సలో దరఖాస్తు చేసుకొని అనుమతులు పొందాలని అధికారులు సూ చించారు. లేనిపక్షంలో భవనాన్ని నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా భవన యజమానులు, అధికారులు మధ్య వాగ్వాదం జరిగింది. తొలగింపు పనులకు అడ్డుపడిన యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేమని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ కౌన్సిలర్లు పొత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, కైరంకొండ వెంకటేశ్వర్లు, ఈరపాక నర్సింహ్మ, పడిగెల రేణుకా ప్రదీప్‌, నజీమాసలాఉద్దిన్‌ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పట్టణంలో అక్రమంగా నిర్మిస్తున్న భారీ భవనాల పట్ల ఉదాసీనత ప్రదర్శిస్తూ సామాన్యుల భవనాలపై నిబంధనలు సాకుచూపుతూ కూల్చివేయడం అన్యాయమని చెప్పారు. అయిన్పటికీ నిబంధనలు పాటించాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. పెంట్‌హౌస్‌ను కూల్చివేసి మిగితా అంతస్థుల దరవాజలు, కిటికీల ను తొలగించారు. దీంతో సంఘటనా స్థలంలో కొద్దిసేపు ఉదిృక్తత నెలకొంది. టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులు తహసీల్దార్‌ శ్యాంసుందర్‌రెడ్డి, పట్టణ ఇన్స్‌పెక్టర్‌ ఎ. సుధాకర్‌, మునిసిపల్‌ కమిషనర్‌ ఎం. పూర్ణచందర్‌, ఆర్‌అండ్‌బీ డీఈ సుగేందర్‌, జిల్లా అగ్నిమాపక అధికారి శివప్రసాద్‌, పట్టణ ప్రణాళిక అధికారి జె. కృష్ణవేణి, టీపీబీవో సీహెచ్‌ నరేష్‌ పర్యవేక్షణలో కూల్చివేతలు కొనసాగాయి. ఇప్పటి వరకు భువనగిరి మునిసిపాలిటీ పరిధిలో 24అక్రమ భవనాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. మూడు అక్రమ నిర్మాణాలను కమిటీ సభ్యుల పర్యవేక్షణలో కూల్చివేతలు కొనసాగాయి.