లాక్‌డౌన్ ఎత్తేయండి : మోదీకి టాస్క్ ఫోర్స్ కీలక నివేదిక

ABN , First Publish Date - 2020-05-29T21:33:44+05:30 IST

నాలుగో దశ లాక్‌డౌన్ మరో రెండ్రోజుల్లో ముగియనుంది. దేశంలో 5 దశ లాక్‌డౌన్ విధిస్తారా? విధిస్తే ఎలా ఉంటుంది? అన్న దానిపై

లాక్‌డౌన్ ఎత్తేయండి : మోదీకి టాస్క్ ఫోర్స్ కీలక నివేదిక

న్యూఢిల్లీ : నాలుగో దశ లాక్‌డౌన్ మరో రెండ్రోజుల్లో ముగియనుంది. దేశంలో 5 దశ లాక్‌డౌన్ విధిస్తారా? విధిస్తే ఎలా ఉంటుంది? అన్న దానిపై దేశవ్యాప్త చర్చ తీవ్రంగా నడుస్తోంది. అయితే అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.... దేశంలో లాక్‌డౌన్ ఎత్తేయాలని నిపుణుల కమిటీ మోదీకి సూచించి, ఓ రిపోర్టును అందజేసినట్లు సమాచారం. అయితే పాఠశాలలు, కాలేజీలు, అన్ని ప్రార్థనా మందిరాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని నిపుణుల కమిటీ సూచించినట్లు తెలుస్తోంది.


అయితే అంతర్జాతీయ విమానాల రాకపోకలపై మాత్రం ఈ కమిటీ ఎలాంటి సూచనలూ చేయలేదు.  జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఇద్దరు సభ్యులతో కేంద్రం ఓ టాస్క్‌ఫోర్సును నియమించింది. అందులో సీకే మిశ్రా, డా. వీకే పాల్ సభ్యులు. అయితే ఇవి కేవలం తాము ప్రభుత్వానికి రిపోర్టు రూపంలో సమర్పించామని, అంతిమ నిర్ణయం మాత్రం కేంద్ర ప్రభుత్వానిదేనని సభ్యులు తెలిపారు. 


Updated Date - 2020-05-29T21:33:44+05:30 IST