మంకీ పాక్స్‌పై టాస్క్‌ఫోర్స్‌

ABN , First Publish Date - 2022-08-02T07:41:44+05:30 IST

మంకీ పాక్స్‌తో కేరళ యువకు డి మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైం ది.

మంకీ పాక్స్‌పై టాస్క్‌ఫోర్స్‌

ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, ఆగస్టు 1: మంకీ పాక్స్‌తో కేరళ యువకు డి మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైం ది. వైరస్‌ వ్యాప్తి తీరును నిశితంగా పరిశీలించేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దేశంలో మంకీ పాక్స్‌ వ్యాప్తి ధోరణులను సమీక్షించి కేంద్రానికి నివేదించనుంది. వైరస్‌ కట్టడికి ఏమేం చర్యలు తీసుకోవాలనేదానిపై సూచనలివ్వనుంది. వైద్యపరమైన వసతుల విస్తరణ, వ్యాక్సిన్‌, వైర్‌సలో మార్పులు తదితరాలపై మార్గదర్శనం చేయనుంది. ఇప్పటివరకు దేశంలో ఐదు మంకీ పాక్స్‌ కేసులు నమోదయ్యాయి. కాగా, కేరళ యువకుడి శాంపిల్స్‌  ఫలితాల్లో మంకీపాక్స్‌ నిర్ధారణ అయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  


వీకే పాల్‌ సారథ్యం

దేశంలో ప్రజారోగ్య సన్నద్ధతపై గత నెల 26న ప్ర ధానమంత్రి ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించి న సమీక్షలో.. మంకీ పాక్స్‌పై టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చే యాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ టాస్క్‌ఫోర్స్‌కు నీ తీ ఆయోగ్‌ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ సా రథ్యం వహిస్తారు. ఎప్పటికప్పుడు మంకీ పాక్స్‌ కేసుల నమోదు, గుర్తింపు, నిర్వహణ చర్యలపై.. జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ, కేంద్ర ఆరోగ్య శాఖ లోని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ సహాయకారులుగా వ్యవహరిస్తారు.


ఢిల్లీలో నైజీరియా వ్యక్తికి మంకీపాక్స్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఢిల్లీలో నివసిస్తున్న 35ఏళ్ల నైజీరియా వ్యక్తికి తాజాగా మంకీపాక్స్‌ సోకింది. ఇటీవలి కాలంలో అతడు విదేశాలకు ప్రయాణాలు చేయలేదని, తాజా పరీక్షలో మంకీపాక్స్‌ పాజిటివ్‌గా తేలిందని అధికారులు వెల్లడించారు. ఇది ఢిల్లీలో రెండవ కేసు కాగా.. దేశవ్యాప్తంగా ఆరవది కావడం గమనార్హం. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గడచిన ఐదు రోజులుగా అతడు ఒళ్లంతా నీటి పొక్కులతో పాటు జ్వరంతో బాధపడుతున్నాడని పేర్కొన్నారు. పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు అతడి నమూనాలు పంపగా.. పరీక్షల్లో మంకీపాక్స్‌ పాజిటివ్‌గా తేలింది. 

Updated Date - 2022-08-02T07:41:44+05:30 IST