పూర్తిస్థాయి కొవిడ్‌ కేంద్రంగా జిల్లా ఆసుపత్రి

ABN , First Publish Date - 2021-04-22T06:46:06+05:30 IST

కోవిడ్‌ రెండో దశ తీవ్రమవుతున్న దృష్ట్యా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తి స్ధాయి కొవిడ్‌ ఆసుపత్రిగా మారుస్తున్నట్టు మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు.

పూర్తిస్థాయి కొవిడ్‌ కేంద్రంగా జిల్లా ఆసుపత్రి

 పడకలు 150 నుంచి 250కి పెంపు : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 21 : కోవిడ్‌ రెండో దశ తీవ్రమవుతున్న దృష్ట్యా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తి స్ధాయి కొవిడ్‌ ఆసుపత్రిగా మారుస్తున్నట్టు మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారులతో జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో బుధవారం టాస్క్‌ఫోర్స్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పేర్ని నాని కోవిడ్‌ నియంత్రణ చర్యలపై సమీక్షించారు. ప్రస్తుతం ఉన్న 150 పడకల ఆసుపత్రిని 250 పడకలకు పెంచుతూ, పూర్తి స్థాయి కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చేందుకు సమావేశం తీర్మానించింది. కొవిడ్‌ రోగులు బైట తిరగకుండా ట్యాగ్‌లు వేయాలని మంత్రి   సూచించారు. ఆశీర్వాద భవన్‌లో కొవిడ్‌ రోగులకు పరీక్షా కేంద్రాన్ని  ప్రారభిస్తున్నా మన్నారు. గైనిక్‌ , పిడియాట్రిషియన్‌ విభాగాలలో సాధారాణ వైద్యం మాత్రమే చేస్దారన్నారు. రైతుబజారును వికేంద్రీకరణ చేస్తున్నట్టు తెలిపారు. మార్కెట్‌ యార్డు, జడ్పీ స్మిమ్మింగ్‌ పూల్‌ వద్ద, పంచాయితీరాజ్‌ కాలనీ, జైహింద్‌ స్కూలు వద్ద కూరగాయల విక్రయాలు చేబడ తారన్నారు. చేపల మార్కెట్‌ను సర్కారుతోట షాపింగ్‌ కాంప్లెక్స్‌, భాస్కరపురం స్కౌట్‌ గ్రౌండ్స్‌, జైహింద్‌ స్కూలు వద్ద ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్డీఓ ఖాజావలి మునిసిపల్‌ కమిషనర్‌ ఎస్‌ శివరామకృష్ణ  తెలిపారు.  ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మాధవీలత, ట్రాఫిక్‌ డీఎస్పీ మాసూం బాషా, డాక్టర్‌ అల్లాడ శ్రీనివాసరావు, డాక్టర్‌ జయకుమార్‌, డాక్టర్‌ మల్లికార్జునరావు, తహసీల్దారు సునీల్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-04-22T06:46:06+05:30 IST