టాలీవుడ్ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ దాడులు

ABN , First Publish Date - 2021-12-11T22:33:22+05:30 IST

నగరంలోని టాలీవుడ్ పబ్‌పై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు

టాలీవుడ్ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ దాడులు

హైదరాబాద్: నగరంలోని టాలీవుడ్ పబ్‌పై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా టాలీవుడ్ పబ్ నడుస్తోంది. సమయం దాటినా కూడా యువతీ, యువకులు అర్ధనగ్న నృత్యాలు చేస్తున్నారు. 9 మంది యువతులు, 34 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న అర్థరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవలే ఈ పబ్‌కు ఎక్సైజ్, పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. పబ్ నిర్వాహకులు వేణుగోపాల్‌, భరద్వాజపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలోనూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా టాలీవుడ్ పబ్ ఉంది.  




Updated Date - 2021-12-11T22:33:22+05:30 IST