Saroornagar హత్య ఘటనపై స్పందించిన Tarun Chugh

ABN , First Publish Date - 2022-05-07T00:06:24+05:30 IST

సరూర్ నగర్ హత్య ఘటనపై బీజేపీ నేత తరుణ్ చుగ్ ట్వీట్‌ ద్వారా స్పందించారు. మతాంతర వివాహం చేసుకున్నందుకు

Saroornagar హత్య ఘటనపై స్పందించిన Tarun Chugh

హైదరాబాద్: సరూర్ నగర్ హత్య ఘటనపై బీజేపీ నేత తరుణ్ చుగ్ ట్వీట్‌ ద్వారా స్పందించారు. మతాంతర వివాహం చేసుకున్నందుకు దళిత యువకుణ్ని హతమార్చడం దారుణమన్నారు. తరుణ్ చుగ్ ట్వీట్‌కి నేషనల్ ఎస్సీ కమిషన్ స్పందించారు. తెలంగాణ పోలీస్‌లకు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇవ్వాలంటూ ఎస్సీ కమిషన్ చైర్మన్ విజయ్ సాంప్లా కోరారు. ఈ సందర్భంగా విజయ్ సాంప్లాకి తరుణ్ చుగ్ కృతజ్ఞతలు తెలిపారు. దళితులపై దాడి రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా Tarun Chugh వర్ణించారు.


అసలేం జరిగిందంటే... 

మతాంతర విహహం చేసుకున్నారనే ఆగ్రహంతో యువతి సోదరుడు పగతో రగిలిపోతూ మరికొందరితో కలిసి యువకుడిని వెంటాడి గడ్డపారతో కొట్టి చంపాడు. రంగారెడ్డి జిల్లా మర్‌పల్లికి చెందిన బిల్లాపురం నాగరాజు (25), పోతిరెడ్డిపల్లెకు చెందిన ఆశ్రిన్‌ సుల్తానా (23) కాలేజీ రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. మతాలు వేరు కావడంతో వీరి పెళ్లికి ఆశ్రిన్‌ సుల్తానా కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. అయితే జనవరి 31న ఆర్యసమాజ్‌లో నాగరాజు-ఆశ్రిన్‌ సుల్తానా వివాహం చేసుకున్నారు. తొలుత బాలానగర్‌ ప్రాంతంలోని అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ పెళ్లికి మునుపు వికారాబాద్‌ పోలీసులను.. పెళ్లి తర్వాత బాలానగర్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బుధవారం నాగరాజు, ఆశ్రిన్‌ దంపతులు.. బైక్‌పై ముసారాంబాగ్‌ వెళ్లారు. తిరిగి ఈ జంట ఇంటికి వస్తున్న సమయంలో కొందరు బైక్‌ను అడ్డగించి నాగరాజుపై దాడి చేసి చంపారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Read more