హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్‌ను గద్దె దించుతామని బిజెపి తెలంగాణ ఇన్ ఛార్జి తరుణ్‌చుగ్(tarun chug) అన్నారు. అందుకోసం బీజేపీ(bjp) కంకణం కట్టుకుందని తెలిపారు. దీనికి సూచనగా మా కార్యాలయం ముందు కౌంట్‌డౌన్ బోర్డ్ పెట్టామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని ఇది చూసి టీఆర్ఎస్(trs)కు భయం పట్టుకుందన్నారు. ఆభయం సీఎం కేసీఆర్‌లో(kcr) కనిపిస్తోందని తరుణ్‌చుగ్ పేర్కొన్నారు. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ అవినీతికి రోజులు దగ్గరపడ్డాయని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి