తర్జన.. భర్జన!

ABN , First Publish Date - 2021-06-22T07:00:35+05:30 IST

పాఠశాలలు తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ కరోనా కేసులు నమోదవుతుండడం.. ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలు ఎత్తివేయడం.. చిన్నపిల్లలపై ఽథర్డ్‌వేవ్‌ వస్తుదని వైద్యనిపుణులు చెబుతుండడంతో తల్లిదండ్రుల ఆందోళనను

తర్జన.. భర్జన!
పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేక, టాయిలెట్ల పరిస్థితి ఇలా..

పాఠశాలల ప్రారంభంపై తల్లిదండ్రుల్లో అనుమానాలు!!

బడులు తెరవాలంటున్న ప్రభుత్వం

కొవిడ్‌ నిబంధనలపై స్పష్టత కరువు

పాఠశాలలో కనీస సదుపాయాల లేమి

శిఽథిలమైన తరగతి గదులు, కనిపించని టాయిలెట్లు

జిల్లాలో మొత్తం 1,257 ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు

బాలురు 74,355 మంది ఉండగా.. బాలికలు 72,234 మంది

కామారెడ్డి, జూన్‌ 21: పాఠశాలలు తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ కరోనా కేసులు నమోదవుతుండడం.. ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలు ఎత్తివేయడం.. చిన్నపిల్లలపై ఽథర్డ్‌వేవ్‌ వస్తుదని వైద్యనిపుణులు చెబుతుండడంతో తల్లిదండ్రుల ఆందోళనను భయంగా మారుస్తోంది. అంతేకాకుండా పలు పాఠశాలల్లో కనీస వసతు లు లేవు. మరుగుదొడ్లు, తరగతి గదులు శిథిలావస్థకు చేరగా.. తాగునీటి వసతి కూడా కరువైంది. ఈ క్రమంలో జూలై 1 నుంచి పాఠశాలలు తెరుస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఆన్‌లైన్‌ లో తరగుతులు నిర్వహించాలని ఆలోచన చేయగా.. 7వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు క్లాసులు నేరుగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

ఒకేసారి ప్రారంభిస్తే ముప్పు

సాధారణ రోజుల్లో 4ఫీట్ల బెంచ్‌పై ముగ్గురు విద్యార్థులు కూర్చుంటారు. ఒక తరగతి గదిలో ఇలా 40మంది ఉంటారు. అయితే ప్రస్తుతం కరోనా భయం ఉండడంతో కొవిడ్‌ నిబంధనలు అమలులో ఉన్నాయి. ఒక్కో విద్యార్థికి కనీసం 6 ఫీట్ల దూరం ఉండేలా కూర్చోబెట్టాలి. కాని ఇది క్షేత్రస్థాయిలో సాధ్యం కాదని విద్యాసంస్థల నిర్వాహకులు పేర్కొంటున్నారు. గతేడాది ఇదే పరిస్థితుల్లో పాఠశాలలను ప్రారంభిస్తే విద్యార్థులు కరోనా బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారితో పాటు ఇతరులకు ఈ వైరస్‌ వ్యాప్తి చెందిందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం 9, 10వ తరగతులను ప్రారంభించి పరిస్థితులు బాగా ఉంటేనే పదిహేను రోజుల తర్వాత 6, 7, 8వ తరగతులను నిర్వహిస్తే బాగుంటుందని తల్లిదండ్రులు కోరుతున్నారు.

కనిపించని కనీస సౌకర్యాలు

అసలే వర్షాకాలం.. సీజనల్‌ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుం ది. పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచడానికి గతంలో నియమించి న పారిశుధ్య సిబ్బందిని ప్రభుత్వం తొలగించింది. ఈ బాధ్యతను గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలకు అప్పగించింది. గతేడాది 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు హాజరవ్వగా.. శానిటేషన్‌ పనులు చేయడంలో మున్సిపల్‌, గ్రామ పంచాయితీ కార్మికు లు ఇబ్బందులు పడ్డారు. పాఠశాలల్లోని తరగతి గదులను శుభ్రపరచడం నుంచి మొదలు పాఠశాల ఆవరణను మొత్తం శుభ్రం చేయలేక అవస్థలు ఎదుర్కొన్నా రు. పాఠశాలలో పారిశుధ్య పనులు చేయలేక ఇటు వార్డులలో, గ్రామాలలో ఇతర పారిశుధ్య కార్యక్రమాలు చేయలేక తలలు పట్టుకున్నారు. ఫలితంగా పాఠశాలల్లో పరిశుభ్రత మాయమైంది. ప్రస్తుతం కూడా అలాగే ఉంటే అంటువ్యాధు లు ప్రబలే ప్రమాదం లేకపోలేదు. ప్రభుత్వం పునరాలోచించి ప్రతిపాఠశాలకు అటెండర్‌, స్వీపర్‌, స్కావెంజర్‌లను వెంటనే నియమించాలని పలు ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎంలు కోరుతున్నారు.

బస్సులకు ఫిట్‌నెట్‌ సమస్య

జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో గతేడాది ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడంతో బస్సులకు ఫిట్‌నెస్‌ చేయించలేదు. ఈ వాహనాలు ప్రస్తుతం రోడ్డు మీదకు రావాలంటే చిన్నపాటి మరమ్మతులు చే యించాల్సి ఉంటుంది. ఒక్కో వాహనానికి కనీసం రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు అవుతుందని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యం చెబుతోంది. అలాగే కొవిడ్‌ నిబంధనల ప్రకారం బెంచీకి ఒక్కో విద్యార్థి ని కూర్చోబెట్టాలంటే భవ నం సరిపోదని, ఇప్పటి కిప్పుడు భవనం మార్చడం సాధ్యంకాదని వారు అభిప్రాయ పడుతున్నారు. 

Updated Date - 2021-06-22T07:00:35+05:30 IST