జడ్జిలపై ఆరోపణలు చేయడం ఫ్యాషన్‌ అయిపోయింది : Supreme Court

ABN , First Publish Date - 2022-05-23T23:01:20+05:30 IST

న్యూఢిల్లీ : జడ్జిలపై ఆరోపణలు చేయడం ఈ రోజుల్లో ఫ్యాషన్‌గా మారిపోయిందని సుప్రీంకోర్ట్ ఆగ్రహం వ్యక్తంచేసింది. న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుంటున్న కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంపై

జడ్జిలపై ఆరోపణలు చేయడం ఫ్యాషన్‌ అయిపోయింది : Supreme Court

న్యూఢిల్లీ : జడ్జిలపై ఆరోపణలు చేయడం ఈ రోజుల్లో ఫ్యాషన్‌గా మారిపోయిందని సుప్రీంకోర్ట్ (supreme court) ఆగ్రహం వ్యక్తంచేసింది. న్యాయమూర్తులను (Judges) లక్ష్యంగా చేసుకుంటున్న కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంపై సర్వోన్నత న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. ఈ తరహా కేసులు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో ఎక్కువగా నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. కోర్ట్ ధిక్కరణకు పాల్పడిన ఓ అడ్వకేట్‌కు(Advocates) 15 రోజుల జైలుశిక్ష విధిస్తూ మద్రాస్ హైకోర్ట్ (Madras High court) తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్ట్ తెలిపింది. అయితే ఈ సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మద్రాస్ హైకోర్ట్ విధించిన జైలుశిక్షను సమర్థిస్తూ ‘లాయర్లేమీ చట్టం కంటే ఎక్కువకాదు’ అని వ్యాఖ్యానించింది. న్యాయ ప్రక్రియను ఉల్లంఘిస్తే న్యాయవాదులైనా(Lawyers) పర్యవసనాలను ఎదుర్కోవాల్సిందేనని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఉల్లంఘనలకు పాల్పడే లాయర్లు న్యాయప్రక్రియలో కళంకం లాంటివారని, అలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందేనని తేల్చిచెప్పింది. నిందిత లాయర్‌కు నాన్-బెయిలబుల్ వారెంట్‌ జారీ చేయడంపై స్పందిస్తూ.. ఈ వ్యక్తి ప్రవర్తన మారేలా కనిపించడం లేదు. ప్రవర్తనలో ఏమాత్రం మార్పులేని లాయర్ల వర్గానికి చెందిన వ్యక్తి ఇతడు. ఇలాంటి న్యాయవాదులు న్యాయవృత్తిలో మచ్చలాంటివారు అని జస్టిస్ డీవై చంద్రచుడ్ కఠిన పదజాలాన్ని ఉపయోగించారు. 


నిందిత లాయర్‌కు 15 రోజుల జైలుశిక్ష విధిస్తూ మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పును జస్టిస్ చంద్రచుడ్ సమర్థించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. జడ్జి ఎంత గట్టివాడైతే.. అతడిపై అంతటి చెత్త ఆరోపణలు చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. జడ్జిలు దేశవ్యాప్తంగా జడ్జిలు దాడులకు గురవుతున్నారని అన్నారు. జిల్లా స్థాయి జడ్జిలకు ఎలాంటి భద్రతా లేదు. ఒక్కోసారి లాఠీ చేతపట్టుకునే పోలీసు కూడా అందుబాటులో ఉండడం లేదని న్యాయమూర్తుల పరిస్థితులను ఆయన వివరించారు.

Updated Date - 2022-05-23T23:01:20+05:30 IST