కానిస్టేబుల్ సత్యనారాయణ
స్థానికులకు చిక్కిన సైకో కానిస్టేబుల్ సత్యనారాయణ
పలు సెక్షన్ల కింద కేసు నమోదు
నల్లగొండ / నల్లగొండ టౌన, జూన 29: ప్రజలకు రక్షణగా ఉండాల్సిన కానిస్టేబుల్ సైకోగా మారాడు. అమ్మాయిలు, ఒంటరి మహిళలను వేధింపులకు గురిచేసేవాడు. నకిరేకల్‌లో ఐడీ పార్టీ కా నిస్టేబుల్‌గా పనిచేస్తున్న పుల్లెంల సత్యనారాయణ నల్లగొండ పట్టణంలోని పద్మానగర్ ఎన్జీబీ కాలనీలో అద్దె ఇంట్లో నివాసముండేవా డు. అదే ఇంట్లో పక్క పోర్షనలో మరో కుటుంబం ఉండేది. ఆ ఇం ట్లో భార్యాభర్తలతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉండేవారు. ఈ రెండు కుటుంబాల మధ్య స్నేహం ఉండటంతో దానిని సాకుగా చేసుకుని సదరు కానిస్టేబుల్ పక్క పోర్షనలో ఉండే అమ్మాయిలపై దుర్బుద్ధి పెంచుకున్నాడు. అతని ప్రవర్తనలో మార్పు గ్రహించిన అమ్మాయి లు ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు సత్యనారాయణతో మాట్లాడటం మానేశారు. ఈ నేపథ్యంలోనే అతను ఆ ఇంట్లో నుంచి ఖాళీచేసి సాయిఫంక్షన సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. సైకో మనస్థత్వం కలిగిన సత్యనారాయణ గతంలో తాను ఉన్న ఇంటి పక్కన అమ్మాయిలను వెంటాడ టం మొదలుపెట్టాడు. ఇతరుల ఫొటోలతో వీరి ఫొటోలను మా ర్ఫింగ్ చేసి అమ్మాయిల ఇంటికి అతికించి వెళ్లేవాడు. పలుమార్లు గమనించిన కుటుంబసభ్యులు కానిస్టేబుల్‌పై అనుమానం రావడంతో నెల రోజుల క్రితం ఎస్పీ రెమా రాజేశ్వరికి ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై పోలీసులు నిఘా పెట్టారు.
ఇంటికి పోస్టర్ అంటిస్తున్న సమయంలో..
సదరు కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల కాలనీవాసులు ప్రతీరోజూ కాపలాగా ఉండటంతో పాటు సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తుండేవారు. సైకో కానిస్టేబుల్ ఈ నెల 26వ తేదీన ద్విచక్ర వాహనంపై వచ్చి మరోసారి సదరు ఇంటికి మార్ఫింగ్ ఫొటోలు అంటిస్తుండగా స్థానికుల కంటపడ్డాడు. పట్టుకోవడానికి ప్రయత్నించడంతో వారితో ఘర్షణ బైక్‌ను అక్కడే వదిలి పరారయ్యాడు. స్థానికులు అదేరోజు బైక్‌ను పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. బై క్ నెంబరు ఆధారంగా పోలీసులు కానిస్టేబుల్ సత్యనారాయణను బుధవారం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుడి ఫిర్యాదు మే రకు సత్యనారాయణపై 354(డి), 509, 465 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు టూటౌన ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. గురువారం రిమాండ్‌కు పంపనున్నట్లు సమాచారం.