Abn logo
Aug 9 2020 @ 13:08PM

మ‌హేశ్‌కు తార‌క్ విషెష్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌కు ఆదివారం(ఆగ‌స్ట్ 9) పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా సినీ ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, అభిమానులు అంద‌రూ మ‌హేశ్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. మ‌రో వైపు హ్యాపీబ‌ర్త్ డే హ్యాష్ ట్యాగ్ ఇప్ప‌టి వ‌ర‌కు 32 మిలియ‌న్ ట్వీట్స్‌ను రీచ్ అయ్యి ఓ రికార్డుని క్రియేట్ చేసింది. తాజాగా మ‌హేశ్‌తో స‌న్నిహితంగా ఉండే మ‌రో అగ్ర హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ట్విట్ట‌ర్ ద్వారా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేశారు. ‘‘హ్యాపీ బర్త్ డే మహేశ్ అన్న.. ఈ ఏడాది నీకు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని ఎన్టీఆర్ తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement