ఫిబ్రవరి 4న తాప్సీ లూప్‌లపేటా

ABN , First Publish Date - 2022-01-09T05:30:00+05:30 IST

తాప్సీ పన్ను లీడ్‌రోల్‌లో నటించిన హిందీ చిత్రం ‘లూప్‌లపేటా’ ఓటీటీలో రిలీజ్‌ కానుంది. ఈ కామెడీ థ్రిల్లర్‌ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 4న విడుదలవుతోంది.

ఫిబ్రవరి 4న తాప్సీ లూప్‌లపేటా

తాప్సీ పన్ను లీడ్‌రోల్‌లో నటించిన హిందీ చిత్రం ‘లూప్‌లపేటా’ ఓటీటీలో రిలీజ్‌ కానుంది. ఈ కామెడీ థ్రిల్లర్‌ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 4న విడుదలవుతోంది. ఈ విషయాన్ని శనివారం నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ప్రకటించింది. తాప్సీ బాయ్‌ఫ్రెండ్‌ పాత్రలో తాహిర్‌ రాజ్‌ భాసిన్‌ నటించారు. ఆపదలో చిక్కుకున్న ఇద్దరు ప్రేమికులు దాన్నుంచి ఎలా భయటపడ్డారనే కథాంశంతో తెరకెక్కింది. ‘ఈ సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’ అని తాప్సీ చెప్పారు. ఆకాష్‌ భాటియా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్‌ ఇండియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. 

Updated Date - 2022-01-09T05:30:00+05:30 IST