ఇటు దక్షిణాది, అటు ఉత్తరాది సినిమాలను చేస్తూ హీరోయిన్గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది తాప్సీ. ఈ సొట్టబుగ్గల సుందరి అన్ని తరహా పాత్రల్లో నటిస్తుంది. ఇప్పుడు మరో క్రేజీ సినిమాలో అగ్ర హీరోతో నటించే అవకాశాన్ని దక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల మేరకు బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్, రాజ్ కుమార్ హిరాణి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షారూక్ ఖాన్ నటిస్తోన్న 'పఠాన్' సినిమా షూటింగ్ ముగియగానే ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుంది. ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్గా నటించనుంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదల చేయాలనేది దర్శక, నిర్మాతల ఆలోచనగా కనిపిస్తుంది.