Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 05 Jul 2022 12:39:22 IST

స్టార్ హీరోయిన్‌తో సినిమాపై Tapsee క్లారిటీ...

twitter-iconwatsapp-iconfb-icon

స్టార్ హీరోయిన్స్ సమంత (Samantha), తాప్సీ (Tapsee) కలిసి సినిమా చేయబోతున్నారనే విషయంలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా వీరిద్దరు కలిసి ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని అంతటా ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను క్లారిటీ ఇచ్చింది. త్వరలో విడుదల కానున్న తన చిత్రం 'శభాష్ మిథు' (Shabhash Mithu). ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. 

ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ సమంతతో ప్రాజెక్ట్ గురించి వెల్లడించింది. ఈ చిత్రంలో తాను ఎలాంటి పాత్ర చేయడం లేదని తెలిపిన తాప్సీ, సమంత లీడ్ పాత్రలో నటిస్తుందని క్లారిటీ ఇచ్చింది. 'సామ్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా చేయడానికి తను మాత్రమే పర్ఫెక్ట్ ఫిట్' అని తాప్సీ చెప్పింది. ఇక ఈ ప్రాజెక్ట్ బాలీవుడ్‌లో సమంతకు మొదటి భారీ చిత్రం కాబోతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. 

కాగా, ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం (Shakuntalam), యశోద (Yashoda) సినిమాలు షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటున్నాయి. ఇక హాలీవుడ్ సినిమా ఒకటి త్వరలో సెట్స్‌పైకి వెళ్ళనుంది. అలాగే, ఈ మధ్య కోలీవుడ్ స్టార్ విజయ్ (Vijay) - లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాలోనూ సమంతను సంప్రదించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే, హిందీలో మరో వెబ్ సిరీస్ కూడా చేస్తుంది. వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న దీనికి దర్శక ద్వయం రాజ్ డీకే డైరెక్షన్ చేస్తున్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement