Jun 11 2021 @ 11:45AM

పెళ్లిపై తాప్సీ క్లారిటీ

టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి.. కోలీవుడ్‌లో అడుగుపెట్టి... బాలీవుడ్‌లో స్థిరపడిన నటి తాప్సీ. మహిళా ప్రాధాన్యత కలిగిన కథా చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. పైగా, చేతిలో అనేక బాలీవుడ్‌ ప్రాజెక్టులతో అంత్యంత బిజీగా ఉంది. ఇదిలావుంటే, తాప్సీ పీక ల్లోతు ప్రేమలో మునిగితేలుతుందట. డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మాథ్యూస్‌ను  ప్రేమిస్తుంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నట్టు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై రీసెంట్‌గా తాప్సీ స్పందిస్తూ, ‘‘చిత్ర పరిశ్రమకు చెందిన వారిలో ఒకరిని జీవిత భాగస్వామిగా ఎంచుకోడం నాకు ఇష్టంలేదు. రాణించే వృత్తి, వ్యక్తిగత జీవితం వేర్వేరుగా ఉండాలి. అదేసమయంలో మ్యాథ్యూస్‌ నాకు బాగా తెలిసిన వ్యక్తి. సన్నిహితుడు కూడా. ప్రస్తుతం యేడాదికి ఆరు చిత్రాల్లో నటిస్తున్నాను. ఈ సంఖ్య రెండు లేదా మూడుకు తగ్గినపుడే నేను పెళ్ళి చేసుకుంటాను’’ అని వివరించింది. అంటే సినీ కెరీర్‌ పీక్‌ స్టేజ్‌లో ఉండగా, వివాహం చేసుకోనని తాప్సీ చెప్పకనే చెప్పిందిగా.