తప్పిపోయిన బాలుడి అప్పగింత

ABN , First Publish Date - 2022-07-07T02:48:21+05:30 IST

కోవూరులో ఓ ప్రముఖ పాఠశాలలో యూకేజీ చదువుతున్న బాలుడిని బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు

తప్పిపోయిన బాలుడి అప్పగింత
బాలుడిని తల్లిదండ్రులకు అప్పగిస్తున్న పోలీసులు

 కోవూరు, జూలై 6:  కోవూరులో ఓ ప్రముఖ పాఠశాలలో యూకేజీ చదువుతున్న బాలుడిని బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. పాటూరు రోడ్డులోని ఆ పాఠశాలకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లి తాము ఆ బాలుడి బంధువులమని చెప్పి తమ వెంట తీసుకువెళ్లారు. ఈ విషయమై సామాజిక మాధ్యమాల్లో వెలుగు చూడటంతో ఎస్‌ఐ డీ వెంకటేశ్వర్లు స్పందించారు. సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టారు. బాలుడ్ని కోనమ్మతోటలోని ఓ ప్రాంతంలో కనుగొన్నారు.  అనంతరం ఎస్‌ఐ  బాలుడ్ని అతడి తలిదండ్రులకు అప్పగించారు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ తెలిపారు.


Updated Date - 2022-07-07T02:48:21+05:30 IST