కుళాయి కనెక్షన్‌ ఇవ్వలేదు.. రూ.18 వేలు కట్టమంటే ఎలా?

ABN , First Publish Date - 2022-01-29T06:08:43+05:30 IST

కుళాయి కనెక్షన్‌ ఇవ్వకుండానే రూ. 18వేలు కట్టామంటున్నారని మంత్రి పేర్ని నానికి మచిలీపట్నం నగరంలో 7వ డివిజన్‌కు చెందిన ఉమ్మిడిశెట్టి రాధిక ఫిర్యాదు చేశారు.

కుళాయి కనెక్షన్‌ ఇవ్వలేదు.. రూ.18 వేలు కట్టమంటే ఎలా?
మంత్రి పేర్ని నానీతో మాట్లాడుతున్న ఫిర్యాదుదారులు

మంత్రి పేర్ని నానీకి బాధితురాలి మొర

మచిలీపట్నం టౌన్‌, జనవరి 28 : కుళాయి కనెక్షన్‌ ఇవ్వకుండానే రూ. 18వేలు కట్టామంటున్నారని మంత్రి పేర్ని నానికి మచిలీపట్నం నగరంలో 7వ డివిజన్‌కు చెందిన ఉమ్మిడిశెట్టి రాధిక ఫిర్యాదు చేశారు. మంత్రిని శుక్రవారం పలువురు కలసి తమ సమస్యలపై వినతిపత్రాలు అందించారు. ఎనిమిదేళ్లుగా కుళాయి కనెక్షన్ల కోసం తిరుగుతున్నానని రాధిక తన గోడు వినిపించుకున్నారు. 38వ డివిజన్‌కు చెందిన ఒక విద్యార్ధి కార్పొరేట్‌ స్కూల్‌ యాజమాన్యం పదో తరగతి సర్టిఫికెట్‌ ఇవ్వటంలేదని మంత్రికి తెలిపారు.  కుళాయిల్లో కలుషితమై తాగునీరు వస్తోందని గుండుపాలెం గ్రామానికి చెందిన  మహిళ మంత్రికి ఫిర్యాదు చేశారు. 


Updated Date - 2022-01-29T06:08:43+05:30 IST