టాంటెక్స్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాతి సంబరాలు

ABN , First Publish Date - 2022-02-05T17:37:05+05:30 IST

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సంక్రాంతి సంబరాలను జనవరి 29న డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. సంస్థ అధ్యక్షుడు ఉమా మహేష్ పార్నపల్లి, సమన్వయ కార్యకర్త ఉదయ్ కిరణ్ నిడిగంటి ఆధ్వర్యంలో

టాంటెక్స్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాతి సంబరాలు

ఎన్నారై డెస్క్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సంక్రాంతి సంబరాలను జనవరి 29న డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. సంస్థ అధ్యక్షుడు ఉమా మహేష్ పార్నపల్లి, సమన్వయ కార్యకర్త ఉదయ్ కిరణ్ నిడిగంటి ఆధ్వర్యంలో ఈ సంబంరాలు జరిగాయి. ఈ సందర్భంగా సంస్థ పూర్వ అధ్యక్షురాలు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి మాట్లాడారు. 2021లో తమ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛంద కార్యక్రమాల గురించి వివరించారు. అంతేకాకుండా 2022 పాలక మండలి సభ్యులకు తన వంతు సాయం చేయనున్నట్టు వెల్లడించారు. అనంతరం సంస్థ నూతన అధ్యక్షుడు ఉమా మహేష్ పార్నపల్లి ప్రసంగిస్తూ.. ‘ఈ ఏడాది మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పిల్లలకు ఆటల పోటీలు, సాహిత్య సమ్మేళనాలు నిర్వహిస్తాం’ అని తెలిపారు. నూతన కార్యవర్గ బృందాన్ని ఓ చక్కటి గేయం ద్వారా సభకు పరిచయం చేశారు. ఉత్తరాధ్యక్షుడిగా శరత్ రెడ్డి ఎర్రం, ఉపాధ్యక్షులుగా సతీష్ బండారు, కార్యదర్శిగా సురేష్ పఠనేని, కోశాధికారిగా సుబ్బారెడ్డి కొండు, సంయుక్త కోశాధికారిగా భాను ప్రకాష్ వెనిగళ్లను పరిచయం చేశారు. 



పాలక మండలి అధిపతి వెంట్ ములుకుట్ల, ఉపాధిపతి అనంత్ మల్లవరపు ప్రసంగిస్తూ సభ్యులకు నూతన ఏడాది, సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన శ్రీనివాసులు బసాబత్తిన, మధుమతి వైశ్యరాజు.. తమ చిన్నతనంలోని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. చిన్నారులు సాహితీ వేముల, సింధూర వేముల వినాయకుడి ప్రార్థనా గీతంలో సంక్రాతి సంబరాలను ప్రారంభించారు. మరికొందరు చిన్నారులు కూచిపూడి, భరతనాట్యం చేసి అందరినీ ఆహ్లాద పరిచారు. డాల్లాస్‌కు చెందిన కళాకారులు ప్రభాకర్ కోట, చక్రపాణి కుందేటి, శారద చిట్టిమల్ల, స్నగ్ద ఏలేశ్వరపు తమ పాటలతో అందరినీ ఉత్సాహ పరిచారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి మాధవి లోకిరెడ్డి ఎంతో నేర్పుగా కార్యక్రమాలను ముందుకు నడిపించారు. చివరగా కార్యక్రమ సమన్వయకర్త ఉదయ్ కిరణ్ నిడిగంటి, పోషక దాతలకు పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేశారు. 




Updated Date - 2022-02-05T17:37:05+05:30 IST