ఘనంగా ముగిసిన టాంటెక్స్ దీపావళి వేడుకలు

ABN , First Publish Date - 2021-11-17T22:00:13+05:30 IST

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు నవంబర్ 13న ఫ్రిస్కో నగరంలోని ఇండిపెండెన్స్ హైస్కూల్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. టాంటెక్స్ అధ్యక్షులు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి తమ కార్యవర్గ సభ్యులతో కలిసి ప్రత్యేక ఆహ్వానితులను సాదరంగా ఆహ్వానించి వేడుకలను వైభవంగా నిర్వహించారు. దీపావళి సాంస్కృతిక కార్యక్రమాలు మ

ఘనంగా ముగిసిన టాంటెక్స్ దీపావళి వేడుకలు

ఎన్నారై డెస్క్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు నవంబర్ 13న ఫ్రిస్కో నగరంలోని ఇండిపెండెన్స్ హైస్కూల్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. టాంటెక్స్ అధ్యక్షులు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి తమ కార్యవర్గ సభ్యులతో కలిసి ప్రత్యేక ఆహ్వానితులను సాదరంగా ఆహ్వానించి వేడుకలను వైభవంగా నిర్వహించారు. దీపావళి సాంస్కృతిక కార్యక్రమాలు మధ్యాహ్నం 3 గంటలకు మొదలై రాత్రి 7 గంటల వరకూ నిర్వరామంగా కొనసాగాయి. అమెరికా జాతీయ గీతము, గణేశస్తుతితో ప్రారంభమైన ఈ వేడుకల్లో స్రవంతి ఎర్రమనేని సంధాన కర్తగా వ్యవహరించారు. వ్యాఖ్యాత, గాయకురాలు మధు నెక్కంటి తన గాన మాధుర్యంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. 


నేపథ్య గాయకులు అర్జున్ అడపల్లి, శృతి నండూరి, శ్రీకాంత్ లంకా పాడిన సుమధుర గీతాలు, స్థానిక కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా టాంటెక్స్ సంస్థకు సహాయ సహకారాలు అందిస్తున్న ఫ్రిస్కో సిటీ మేయర్ జెఫ్ చెనీ, ప్రొటెం మేయర్ బల్ వుడ్ వర్డ్, ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ మెంబర్ జాన్ కీటింగ్, ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ ఉమన్ ఎంజెలీయా పెహ్లామ్, ఫ్రిస్కోసిటీ బోర్డు ఆఫ్ ట్రస్టీ గోపాల్ పోణంగి, ఫ్రిస్కో సిటీ పార్కులు మరియు రీక్రియేషన్ బోర్డు మెంబర్ వేణు భాగ్యనగర్, ఫ్రిస్కో సిటీ అర్బన్ ఫారెస్ట్ బోర్డు మెంబరు పవన్ రాజ్ నెల్లుట్ల ఫ్రిస్కో ఇంక్లూషన్ కమిటీ ఛైర్ సునీత చెరువును ఘనంగా సన్మానించారు. 



అనంతరం అధ్యక్షులు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి మాట్లాడారు. కార్యక్రమం జయప్రదం కావడానికి సహకరించిన ఈవెంట్ కోఆర్డినేటర్ స్రవంతి ఎర్రమనేని, ట్రెజరర్ చంద్ర పొట్టిపాటి, కల్చరర్ ఛైర్ సురేష్ పతనేని, మెంబర్ షిప్ ఛైర్ సుబ్బారెడ్డి, ఫుడ్ కమిటీ ఛైర్ ఉదయ్ కిరణ్ నిడిగంటి తదితరులను అభినందించారు. అంతేకాకుండా స్టూడెంట్ వాలంటీర్లను, ఫుడ్ కమిటీ వాలంటీర్లను కూడా ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఎల్లపుడూ వినూత్న కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందని తెలియజేశారు. 




Updated Date - 2021-11-17T22:00:13+05:30 IST