చెరువు గట్ల సుందరీకరణ..

ABN , First Publish Date - 2022-08-07T07:01:58+05:30 IST

ఉపాధి పనుల ద్వారా జిల్లాలో 24 చెరువులను అభివృద్ధి చేసి సుందరీకరిస్తున్నామని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అన్నారు. నందిగామ మండలం లింగాలపాడులో రూ. 10.38 లక్షల ఉపాధి నిధులతో అభివృద్ధి చేసిన చెరువును శనివారం ఆయన పరిశీలించారు.

చెరువు గట్ల సుందరీకరణ..

- 15న జిల్లాలో అమృత్‌ సరోవర్‌ ఉత్సవాలు  

- గట్ల వెంట పార్కులు, వాకింగ్‌ ట్రాక్‌లు 

- ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు వెల్లడి

నందిగామ రూరల్‌, ఆగస్టు 6 : ఉపాధి పనుల ద్వారా జిల్లాలో 24 చెరువులను అభివృద్ధి చేసి సుందరీకరిస్తున్నామని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అన్నారు. నందిగామ మండలం లింగాలపాడులో రూ. 10.38 లక్షల ఉపాధి నిధులతో అభివృద్ధి చేసిన చెరువును శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో ఉపాధి నిధుల ద్వారా 24 చెరువులను అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే 22 చెరువుల పనులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. మరో రెండు చెరువుల పనులు కూడా పూర్తి కావచ్చాయన్నారు. చెరువుల చుట్టూ మొక్కలు నాటి పార్క్‌, వాకింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేసి, ఆగస్టు 15వ తేదీ అమృత్‌ సరోవర్‌ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ చెరువును అబివృద్ధి చేయటం వల్ల 51 ఎకరాల ఆయకట్టుకు సంపూర్ణ సాగు నీరు అందించటం జరుగుతుందన్నారు. చెరువును అబివృద్ధి చేసి చుట్టూ ఫల మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 1.23 లక్షల కుటుంబాలలోని 2.12 లక్షల మంది కూలీలు పని చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బొల్లినేని పద్మజ, వైస్‌ ఎంపీపీ ఆకుల హనుమంతరావు, ఎంపీటీసీ సభ్యుడు నరసింహారావు, ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్ధార్‌ నరసింహారావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-07T07:01:58+05:30 IST