Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 29 2021 @ 15:19PM

హైదరాబాద్ పర్యాటకులకు శుభవార్త

హైదరాబాద్: వీకెండ్ వస్తే చాలు.. హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో సందడిగా మారతాయి. ముఖ్యంగా ట్యాంక్ బండ్‌పై  సాయంత్రం వేళల్లో గడిపేందుకు ఇష్టపడనివారుండరు. కానీ ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో అక్కడ నిముషం కూడా ఆగే పరిస్థితిలేదు. దీంతో ప్రభుత్వం ప్రత్యేకచర్యలు చేపట్టింది. ఇక నుంచి ప్రతీ ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో సరికొత్త ఆంక్షలు విధించింది. ఈ రోజు నుంచే అమల్లోకి రానున్నాయి.


ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 వరకు కేవలం సందర్శకులకు మాత్రమే అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటకులకు అనుకూలంగా ట్యాంక్ బండ్‌ను ఆధునీకరించారు. 

Advertisement
Advertisement