పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న తనికెళ్ల భరణి
కవులకు పుట్టినిల్లు నరసాపురం
సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి
‘నేనొక అనుభూతి’ పుస్తకావిష్కరణ
నరసాపురం, జనవరి 17: మనస్సుని కదిలించే శక్తి ఒక్క కవిత్వానికే ఉందని సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి అన్నారు. సోమవారం అల్లూరి సాంస్కృతిక కేంద్రంలో ప్రముఖ కవి ఎంఎస్ సూర్యనారాయణ రచించిన ‘నేనొక అనుభూతి’ పుస్తకాన్ని ఆయన అవిష్కరించారు. కప్పి చెబితే అది కవిత్వం కాదు, సత్యంతో చెప్పేదే కవిత్వ మన్నారు. తియ్యని అనుభూతుల్ని మిగిల్చేది కూడా కవిత్వమన్నారు. ఈ పుస్తక రచయితకు ప్రేమ తప్ప మరేమీ తెలియదని, అందుకే ఇంత మంచి కవితలతో పుస్తకాన్ని రచించగలిగారన్నారు. నరసాపురం పట్టణం ఆథ్యాత్మిక కేంద్రమే కాదు... కవులకు పుట్టినిల్లన్నారు. కడిమెళ్ల, రెడ్డప్పఽ దవేజీ, మంకు శ్రీను, పెద్దిరెడ్డి గణేష్, పొన్నమండ రామరావు, పెన్మత్స బాబుశ్రీ తదితరులు పాల్గొన్నారు.