ఉమాని తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్న మహిళా నేత

ABN , First Publish Date - 2021-01-19T17:36:48+05:30 IST

దేవినేని ఉమా మహేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకుని వెళుతున్న వాహనాన్ని..

ఉమాని తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్న మహిళా నేత

కృష్ణా జిల్లా: ఇబ్రహీంపట్నం, ఈలప్రోలు వద్ద టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకుని వెళుతున్న వాహనాన్ని నందిగామా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కొద్ది సేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ‘దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం.. సీఎం జగన్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు.


గొల్లపూడి సెంటర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి కొడాలి నాని సవాల్‌కు ప్రతి సవాల్‌గా టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ దీక్షకు యత్నించగా దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-01-19T17:36:48+05:30 IST