కొలకలూరి ఇనాక్‌కు తంగిరాల కృష్ణప్రసాద్‌ స్మారక అవార్డు

ABN , First Publish Date - 2020-09-28T06:16:14+05:30 IST

పద్మశ్రీ పురస్కారగ్రహీత, మాజీ ఉపకులపతి, శతాధిక గ్రంథకర్త కొలకలూరి ఇనాక్‌ కథ, నవల, కవిత, విమర్శ, పరిశోధన, అనువాద రంగాలతోబాటు నాటక...

కొలకలూరి ఇనాక్‌కు తంగిరాల కృష్ణప్రసాద్‌ స్మారక అవార్డు

కొలకలూరి ఇనాక్‌కు తంగిరాల కృష్ణప్రసాద్‌ స్మారక అవార్డు

పద్మశ్రీ పురస్కారగ్రహీత, మాజీ ఉపకులపతి, శతాధిక గ్రంథకర్త కొలకలూరి ఇనాక్‌ కథ, నవల, కవిత, విమర్శ, పరిశోధన, అనువాద రంగాలతోబాటు నాటక రచయితగా కూడా సత్తాని చాటారు. అనేక నాటకాలు, నాటికలు వ్రాయడమేకాక వాటికి దర్శకత్వం వహించి నటించారు కూడా. నాటక రంగంలో వీరి తోడ్పాటుకు ఇప్పుడు మరో పురస్కారం వచ్చి చేరింది. గతంలో మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి, ఆచంట వెంకటరత్నం నాయుడు, చాట్ల శ్రీరాములు, బోయి భీమన్న, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి, రావి కొండలరావు వంటి ప్రముఖలను వరించిన తంగిరాల కృష్ణ ప్రసాద్‌ స్మారక అవార్డును వీరు స్వీకరిస్తు న్నారు. అక్టోబరు 2న హైదరాబాద్‌లో అవార్డు స్వీకారం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారికి అభినందనలు.

కోడీహళ్లి మురళీ మోహన్‌


కథల పోటీకి ఆహ్వానం

తిమ్మాపురం బాలకృష్ణరెడ్డి కుటుంబ సభ్యులు ్క్ష ‘సారంగ’ నిర్వహ ణలో కథల పోటీకి ఆహ్వానం. ఒక్కో కథకు పది  వేల రూపాయల (150 డాలర్లు) చొప్పున, మూడు ఉత్తమ కథలకు 30 వేల రూపా యలు బహుమతి. అక్టోబర్‌ 15లోగా 15 పేజీలకు మించని కథలను యూనీకోడ్‌  వర్డ్‌ డాక్యుమెంట్‌లో ్టఛజుట.ట్చజిజ్టీడ్చఝఃజఝ్చజీజూ.ఛిౌఝకు పంపాలి. ఫలితాలు: నవంబర్‌ 1న తెలుస్తాయి. కథలు ‘సారంగ’ పక్ష పత్రిక నవంబర్‌ సంచికలో ప్రచురితం అవుతాయి.

అఫ్సర్‌


గార్లపాటి పురస్కారాలు

సెప్టెంబర్‌ 28 సోమవారం తిరుపతిలో జాషువా జయంతి సభలో - గ్రంథాలయోద్యమకర్త వి.షణ్ముగంకు మునస్వామి నాయుడు పుర స్కారం, రచయిత్రి ఎండపల్లి భారతికి నారాయణమ్మ పురస్కారం ప్రదానం జరుగుతుంది. 

గార్లపాటి దామోదరం నాయుడు

Updated Date - 2020-09-28T06:16:14+05:30 IST