జపాన్‌లో ప్రేమికుల రోజున ఏం చేస్తారంటే..

ABN , First Publish Date - 2022-07-10T17:31:54+05:30 IST

భారతదేశంలో వాలెంటైన్స్ డే ప్రేమను...

జపాన్‌లో ప్రేమికుల రోజున ఏం చేస్తారంటే..

భారతదేశంలో వాలెంటైన్స్ డే ప్రేమను వ్యక్తీకరించే రోజుగా పరిగణిస్తారు. చాలా పాశ్చాత్య దేశాలలోనూ ఇదే ఆచారం ఉంది. అయితే జపాన్‌లో దీనికంటూ ప్రత్యేకమైన రోజు ఉంది. దీనిని తానాబాతా పండుగ అంటారు. ఇటీవల జపాన్‌లోని టోక్యోలో ఈ పండుగను జరుపుకున్నారు. ఈ పండుగను ప్రేమ జంట ఒరిహైమ్, హికోబోషిల జ్ఞాపకార్థం నిర్వహిస్తారు. ఈ పండుగ విశిష్టత ఏమిటి? ఒరిహైమ్-హికోబోషి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 


జపనీస్ జానపద కథల ప్రకారం ఒరిహైమ్ కష్టపడి పనిచేసే ఆవుల కాపరి. ఆయనకు హికోబోషితో వివాహం అయిన తర్వాత తన విధులను విస్మరించసాగాడు. దీంతో హికోబోషి తండ్రి టెంటాయ్ కోపాన్ని ఒరిహైమ్ ఎదుర్కోవలసి వచ్చింది. దీంతో ఆ భార్యాభర్తలు ప్రతి ఏటా ఏడవ నెలలోని 7వ తేదీన మాత్రమే కలుసుకోవడానికి అనుమతించేలా నిబంధన విధించారు. తద్వారా వారిద్దరూ మిగిలిన రోజులలో తమ బాధ్యతలను నెరవేర్చాలని తీర్మానించారు. జపాన్‌లో తానాబాతా ఉత్సవం ఏడవ నెల ఏడవ తేదీ సాయంత్రం జరుపుకుంటారు. అంటే జూలై 7న జరుపుకుంటారు. దీనిని ఇక్కడ వాలెంటైన్స్ డేగా జరుపుకుంటారు. ఆరోజు జోజోజీ ఆలయాన్నిలాంతర్లతో అలంకరిస్తారు. ఈ అలంకరణతో ప్రేమ బంధం బలపడుతుందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఆ రోజున ప్రేమ జంటలు  ఒకరికొకరు ప్రేమ సందేశాలను రాస్తారు. ఈ ఉత్సవం జపాన్ అంతటా జరుగుతుంది. 

Updated Date - 2022-07-10T17:31:54+05:30 IST