TANA ఉపకారవేతనాల పంపిణీ

ABN , First Publish Date - 2022-03-20T13:04:09+05:30 IST

చదువు చాలా ఖరీదైపోవడంతో పేద విద్యార్థులు విద్యకు దూరమైపోతున్నారని గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా వ్యాఖ్యానించారు.

TANA ఉపకారవేతనాల పంపిణీ

విజయవాడ, మార్చి 19(ఆంధ్రజ్యోతి): చదువు చాలా ఖరీదైపోవడంతో పేద విద్యార్థులు విద్యకు దూరమైపోతున్నారని గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో తానా(తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా) ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తెలుగు విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తూ ఆర్థిక తోడ్పాటునందించడం అభినందనీయమన్నారు. శనివారం విజయవాడలోని ఓ హోటల్‌లో ‘తానా చేయూత’ ఉపకార వేతనాల చెక్కులను విద్యార్థులకు సిసోడియా చేతుల మీదుగా పంపిణీ చేశారు. తానా కార్యదర్శి వల్లేపల్లి శశికాంత్‌ సౌజన్యంతో సుమారు 170 మందికి మొత్తం దాదాపు రూ.18 లక్షలు అందజేశారు.


తానా కార్యదర్శి వల్లేపల్లి శశికాంత్‌ మాట్లాడుతూ తానా చేయూత కార్యక్రమం కింద ఏటా వెయ్యి నుంచి 1500 మంది తెలుగు విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తున్నామన్నారు. గత రెండు దశాబ్దాలలో రూ.400కోట్లకుపైగా వెచ్చించి వివిధ సేవా కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రజలకు సహాయ సహకారాలు అందించినట్లు వివరించారు. ఈ సందర్భంగా వల్లేపల్లి శశికాంత్‌ను మాజీ డీజీపీ మాలకొండయ్య అభినందించారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం అధ్యక్షత వహించగా, తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, యార్లగడ్డ వెంకట రమణ సమన్వయం చేశారు. 

Updated Date - 2022-03-20T13:04:09+05:30 IST