శోభానాయుడు ఆకస్మిక మృతిపై 'తానా' సంతాపం

ABN , First Publish Date - 2020-10-14T15:31:44+05:30 IST

ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ శోభానాయుడు ఆకస్మిక మరణం పట్ల తెలుగు అసొసియేష‌న్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) సంతాపం తెలిపింది.

శోభానాయుడు ఆకస్మిక మృతిపై 'తానా' సంతాపం

ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ శోభానాయుడు ఆకస్మిక మరణం పట్ల తెలుగు అసొసియేష‌న్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) సంతాపం తెలిపింది. శోభానాయుడు ఆకస్మిక మరణం కళా రంగానికే తీరని లోటు అని పేర్కొంది. శోభానాయుడు కుటుంబ సభ్యులకు తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, కార్యదర్శి పొట్లూరి రవి ప్ర‌గాఢ సానుభూతి తెలియజేశారు. హైదరాబాద్‌లో కూచిపూడి ఆర్ట్స్ అకాడమీని స్థాపించి వేల మందికి కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇచ్చి కళారంగానికి ఎనలేని సేవలు చేసారని కొనియాడారు. తానా సంస్థతో శోభానాయుడుకు దశాబ్దాల అనుబంధం ఉందని, పలు మార్లు తానా మహాసభలకు విచ్చేసి నృత్య ప్రదర్శనలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2010, జులై 31వ తేదీని "తానా శోభానాయుడు డే"గా  డల్లాస్‌లో జరుపుకుని అవార్డుతో స‌త్క‌రించిన‌ట్లు జయశేఖర్ తాళ్లూరి తెలిపారు.   

Updated Date - 2020-10-14T15:31:44+05:30 IST