ఘనంగా జరిగిన తానా “మదర్స్ డే - అమ్మా నీకు వందనం” వర్చువల్ పోటీలు

ABN , First Publish Date - 2020-05-26T19:33:44+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఈ సంవత్సరం వినూత్నంగా అంతర్జాలంలో నిర్వహించిన మదర్స్ డే 2020 వర్చువల్ పోటీలు ఘనంగా జరిగాయి.

ఘనంగా జరిగిన తానా “మదర్స్ డే - అమ్మా నీకు వందనం” వర్చువల్ పోటీలు

చరిత్ర సృష్టించిన తానా “మదర్స్ డే - అమ్మా నీకు వందనం”

వర్చువల్ గ్లోబల్ కాంపిటీషన్స్ 2020 :  జయహో!.. అదరహో !

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఈ సంవత్సరం వినూత్నంగా అంతర్జాలంలో నిర్వహించిన మదర్స్ డే 2020  వర్చువల్ పోటీలు ఘనంగా జరిగాయి. ఈ లాక్‌డౌన్‌ సమయంలో “మదర్స్ డే” వేడుకలు నిర్వహించాలన్న పట్టుదలతో తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి గారి ప్రొత్సాహంతో, ఉమెన్స్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ శిరీష తునుగుంట్ల, లక్ష్మి దేవినేని ఇంటర్నేషనల్ కో-అర్దినేటర్ నిర్వహణలో “తానా” సంస్థ ఆధ్వర్యంలో జరిగిన తానా “మదర్స్ డే - అమ్మా నీకు వందనం” వర్చువల్ పోటీలు అదుర్స్ అనిపించాయి. “జిజ్ఞాస”, “జయహో భారతీయం” “AP-NRTS “ సంస్థల సహకారంతో  నిర్వహించిన ఈ వర్చువల్ గ్లోబల్ కాంపిటీషన్స్-2020 తానా చరిత్రలోనే ఒక సరికొత్త ప్రయోగం. వినూత్న అనుభవం. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 7 విభాగాలలో జరిగిన పోటీలు జ‌రిగాయి. వివిధ దేశాల నుండి 1850 మంది తెలుగు ప్రజలు జూమ్ వీడియో యాప్ ద్వారా వీటిలో పాల్గొన్నారు. వేరు విభాగాలలో 100 మంది జడ్జీలు పాల్గొని 128 గంటల నిడివిలో కార్యక్రమం జరిపి దిగ్విజయం చేశారు. ఇంత పెద్ద ఎత్తున అంతర్జాలంలో విజయవంతంగా నిర్వహించిన ఈ కార్యక్రమo “ఇండియన్ బుక్ అఫ్ రికార్డ్స్” లో,  “ఇండియన్ వరల్డ్ రికార్డ్” టైటిల్‌ను మరియు "తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్”లో కూడా చోటు ద‌క్కించుకుని చరిత్రలో నిలిచింది. ఈ మదర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు, పెద్దలకు, మహిళలకు, పిల్లలకు మరచిపోలేని తియ్యని జ్ఞాపకాల్ని మిగిల్చింది.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి గారు స్వాగతోపన్యాసం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. “అమ్మ అందమైన అనుబంధం.. అంతులేని అనురాగం.. మరపురాని మధుర జ్ఞాపకం.” అంటు అమ్మ గొప్పతనాన్ని కొనియాడారు. ప్రపంచమంతా ఒక సందిగ్ద పరిస్థితిని ఎదుర్కుoటున్న ఈ సందర్భంలో ఒకరికొకరు దూరంగా ఉన్నా మానసికంగా అమ్మకు ఎంత దగ్గరగా ఉన్నామో, అమ్మకు మన హృదయాలలో ఎoత గొప్ప స్థానముందో నిరూపించారన్నారు.


మే 16న ప్రారంభోత్సవ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసి తమ అమూల్యమైన అనుభవాలను పంచుకుని శుభాకాంక్షలు తెలియజేసారు. ఇందులో పాల్గొన్న

· విజయ భాస్కర్ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాష మరియు సాంస్కృతిక శాఖ మాజీ డైరెక్టర్‌కు,

· ఎల్ వి సుబ్రమణ్యం - ఐఎఎస్ అధికారి - ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ప్రభుత్వం- ప్రస్తుత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారికి, 

· అడుసుమల్లి రాజమౌలి ఐఎఎస్ - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మాజీ ప్రధాన కార్యదర్శి-ప్రస్తుత ప్రధాన కార్యదర్శి (ఎపి ప్రభుత్వం),

· మాధవరావు పట్నాయక్ - న్యాయమూర్తి వినియోగదారుల కోర్టు (విజయవాడ)

· శ్రీమతి. రాజని ప్రియా - ఎస్టేట్ మేనేజర్ - ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్-రాష్ట్రపతి భవని-భారత ప్రభుత్వం గారికి, 

·   కోనేరు కాంచన - కార్యదర్శి కెఎల్‌యు గారికి తానా అధ్యక్షులు జయ్ తాళ్లూరి మరియు వారి బృందం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.


అలాగే మే 17 తేదీ రెండవ రోజు జరిగిన ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు విజేతలను అభినందిస్తూ బహుమతులు ప్రకటించి  తమ సందేశాల్లో అమ్మతో తమకున్న మధురానుభూతులను నెమరువేసుకున్నారు.


• పద్మవిభూషణ్ శ్రీ వరప్రసాద్ రెడ్డి, చైర్‌పర్సన్, సంత బయోటెక్,

• విజయ భాస్కర్ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్స్. భాష మరియు సంస్కృతి విభాగం డైరెక్టర్. గారికి,

 • మన్మోహన్ సింగ్ ఐఎఎస్ ఎక్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారికి,

 • పీవీ సునీల్ కుమార్, ఐపిఎస్ డిజి, చీఫ్, సిఐడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారికి,

 • అదుసుమల్లి రాజమౌళి, ఐఎఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారికి,

 • వీవీ (జెడి) లక్ష్మి నారాయణ, ఐపిఎస్ ఎక్స్ జెడి సిబిఐ గారికి,

 • మెదసాని వెంకట్, చైర్మన్, APNRTS, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారికి,

 • రమేష్ బాబు పోతినేని, చైర్మన్, ప్రముఖ కార్డియాలజిస్ట్, రమేష్ హాస్పిటల్స్ గారికి,

 • శ్రీ హిమాన్షు శుక్లా IAS జాయింట్ కలెక్టర్, వెస్ట్ గోదావరి, ఎక్స్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ టూరిజం గారికి

• కోనేరు సత్యనారాయణ, కెఎల్‌యు విశ్వవిద్యాలయం చైర్మన్ గారికి తానా అధ్యక్షులు జయ్ తాళ్లూరి గారు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసి తానా పూర్వ అధ్యక్షులు జయరామ్ పాలు పంచుకున్నారు.





Updated Date - 2020-05-26T19:33:44+05:30 IST