ఫిలడెల్ఫియాలో TANA మిడ్ అట్లాంటిక్ బృందం కమ్యూనిటీ ఈవెంట్

ABN , First Publish Date - 2021-12-16T13:55:53+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) మిడ్ అట్లాంటిక్ బృందం ఫిలడెల్ఫియాలో మంగళవారం(డిసెంబర్ 14) కమ్యూనిటీ కార్యక్రమం నిర్వహించింది.

ఫిలడెల్ఫియాలో TANA మిడ్ అట్లాంటిక్ బృందం కమ్యూనిటీ ఈవెంట్

ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) మిడ్ అట్లాంటిక్ బృందం ఫిలడెల్ఫియాలో మంగళవారం(డిసెంబర్ 14) కమ్యూనిటీ కార్యక్రమం నిర్వహించింది. స్థానిక జాన్ బార్టమ్ హై స్కూల్‌లో విద్యార్థులకు సుమారు 150 బ్యాక్‌ప్యాక్‌లు పంచిపెట్టింది. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ బ్రియాన్ జాన్సన్, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ జెరెమీ కూపర్ తానా మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ గొప్ప విరాళాల కార్యక్రమానికి తమ పాఠశాలను ఎంచుకున్నందుకు మిడ్ అట్లాంటిక్ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.     


రవి పొట్లూరి, సతీష్ తుమ్మలతో కలిసి మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ సమన్వయకర్త సునీల్ కోగంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైనందుకు జగదీష్ అనుముల, కిరణ్ క్రోతపల్లి, గోపి వాగ్వలకు సునీల్ ధన్యవాదాలు తెలిపారు. మునుముందు కూడా తానా నాయకత్వం, అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు సహకారంతో ఇలాంటి కమ్యూనిటీ ఈవెంట్స్ మరిన్ని నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తానా మిడ్ అట్లాంటిక్ బృందం వెల్లడించింది. ఇక ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన రాజా కసుకుర్తి (కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్), పరమేష్ దేవినేని (బ్యాక్‌ప్యాక్ చైర్), తానా ఫిలడెల్ఫియా బృందానికి సునీల్ కోగంటి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే స్కూల్ మేనేజ్‌మెంట్‌తో బ్యాక్‌ప్యాక్ ప్రోగ్రామ్‌ను సమన్వయం చేసినందుకు రజిత మాలేకి ప్రత్యేక అభినందనలు తెలిపారు.  






Updated Date - 2021-12-16T13:55:53+05:30 IST