నిరుపేద విద్యార్థినులకు తానా ఆధ్వర్యంలో ల్యాప్‌టాప్‌ల పంపిణీ

ABN , First Publish Date - 2021-08-01T03:13:07+05:30 IST

గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థినులకు లాప్‌టాప్‌లను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని తానా చేపట్టింది. దీనిలో భాగంగా గుంటూరులోని పేద విద్యార్థినులకు, ప్రతిభ చూపే వా

నిరుపేద విద్యార్థినులకు తానా ఆధ్వర్యంలో ల్యాప్‌టాప్‌ల పంపిణీ

ఎన్నారై డెస్క్: గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని తానా చేపట్టింది. దీనిలో భాగంగా గుంటూరులోని పేద విద్యార్థినులకు, ప్రతిభ చూపే వారికి ఆశ్రయం కల్పిస్తున్న కమ్మజన సేవా సమితిలోని 32 మందికి గుంటూరు మున్సిపల్ కమిషనర్ చల్లా అనురాధ చేతుల మీదుగా శనివారం సాయంత్రం ఈ ల్యాప్‌టాప్‌లను అందజేశారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ తానా చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమాన్ని ప్రశంసించారు. ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థినులను ప్రోత్సహించడం సంతోషకరమని కొనియాడారు. 


తానా తోడ్పాటు పేరిట జరిగిన ఈ కార్యక్రమాన్ని తానా ప్రతినిధులు ఉప్పుటూరి రాంచౌదరి, సమన్వయకర్త సామినేని రవిలు పర్యవేక్షించారు. విజయవాడతో పాటు దాదాపుగా అన్ని జిల్లా కేంద్రాల్లో తానా ఆధ్వర్యంలో నిరుపేద ప్రతిభావంతులైన విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లు అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని వీరు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ సభ్యురాలు ఉప్పుటూరి సీతామహాలక్ష్మి, ఆక్స్‌ఫోఋడ్ పాఠశాల ప్రిన్సిపల్ తుమ్మల రమాదేవి, కమ్మజన సేవా సమితి ప్రతినిధులు సామినేని కోటేశ్వరరావు, మద్ది సాంబశివరారు, గోరంట్ల పున్నయ్యచౌదరి, గుంటుపల్లి కోటేశ్వరరావు, మర్రిపూడి సీతారామయ్య, వడ్లమూడి శివరామకృష్ణయ్య, పావులూరి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-08-01T03:13:07+05:30 IST