TANA Foundation: ‘చేయూత’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ

ABN , First Publish Date - 2022-08-01T16:33:56+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అమెరికాలోని తెలుగు ప్రజలకు అండగా ఉంటూ కావాల్సిన సహాయం అందించడంలో ముందుంటుందన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలో

TANA Foundation: ‘చేయూత’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ

ఎన్నారై డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అమెరికాలోని తెలుగు ప్రజలకు అండగా ఉంటూ కావాల్సిన సహాయం అందించడంలో ముందుంటుందన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలోనే ‘చేయూత’ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ప్రకాశం జిల్లాలోని సీఎస్ పురం గ్రామానికి చెందిన 30 మంది పేద విద్యార్థులకు TANA Foundation స్కాలర్షిప్‌లను అందజేసింది. తానా ఉమెన్ ఎంపవర్‌మెంట్ చైర్ మాధురి ఏలూరు ఈ కార్యక్రమానికి హాజరై అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షి‌ప్‌లు(scholarships) అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మరిన్ని సేవా కార్యక్రమాలను ప్రారంభించేందుకు తానా కృషి చేస్తోందన్నారు. కాగా.. కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-01T16:33:56+05:30 IST