విద్యార్థులకు పారితోషికాలు అందించిన తానా మాజీ కార్యదర్శి పొట్లూరి రవి

ABN , First Publish Date - 2021-10-21T00:12:51+05:30 IST

ఉన్నతోద్యోగాల కోసం, మంచి భవిష్యత్ కోసం విదేశాలకు వెళ్లిన ప్రవాసులు.. మాతృభూమిపై మమకారాన్ని చాటుకుంటున్నారు. తెలుగు భాషను ఆదరించడంలో ముందుంటూనే

విద్యార్థులకు పారితోషికాలు అందించిన తానా మాజీ కార్యదర్శి పొట్లూరి రవి

ఉన్నతోద్యోగాల కోసం, మంచి భవిష్యత్ కోసం విదేశాలకు వెళ్లిన ప్రవాసులు.. మాతృభూమిపై మమకారాన్ని చాటుకుంటున్నారు. తెలుగు భాషను ఆదరించడంలో ముందుంటూనే తెలుగు నేలపై సేవాకార్యక్రమాలను కూడా చేస్తున్నారు. పేద విద్యార్థులకు అండగా నిలిచి వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. చేయూత అనే పేరుతో తానా సంస్థ కొంత కాలంగా పేద విద్యార్థులకు సాయం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అనంతపురం నగరంలో ఏడుగురు విద్యార్థులకు నగదు పారితోషికాన్ని అందించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


అనంతపురం నగరానికి చెందిన ఏడుగురు విద్యార్థులకు తానా మాజీ కార్యదర్శి, ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి సహకారంతో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గౌస్ మోహిద్దున్ కార్యాలయంలో డెబ్భై వేల రూపాయలు పారితోషికాలు అందజేశారు. కరోనా వైరస్ తీవ్రతతో ప్రతిభావంతులైన విద్యార్థులు పలు ఇబ్బందులు పడుతున్నారని వారి కోసం తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయూత అనే సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. విద్యార్థులైన ప్రజ్వలేశ్వర్, మసూద్ వలీ, పర్వీన్, రోషిని, ఈప్సిత, సాయి దీపక్, హర్షితలకు పారితోషికాలు అందించినట్లు పొట్లూరి రవి తెలిపారు. ప్రతిభ గల విద్యార్ధినీ, విద్యార్దుల లక్ష్యంగా చేయూత కార్యక్రమం చేపట్టటం జరిగిందని తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ, ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి తెలిపారు. హరీష్ రెడ్డి, గోపాల్, సురేష్, రామకృష్ణ, జాఫర్, మున్వర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



Updated Date - 2021-10-21T00:12:51+05:30 IST